Share News

Dark Circles: కళ్ల కింద నలుపు తగ్గాలంటే...

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:07 AM

ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పుల కారణంగా కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. పోషకాహారంతోపాటు సరైన నిద్ర ఉండేలా చూసుకుంటూ కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Dark Circles: కళ్ల కింద నలుపు తగ్గాలంటే...

రాత్రి పడుకునేముందు రెండు చెంచాల ఆలివ్‌ నూనెని కొద్దిగా వేడి చేసి కళ్ల చుట్టూ రాయాలి. వేళ్లతో సున్నితంగా మర్దన చేయాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కళ్ల చుట్టూ రక్త ప్రసరణ మెరుగై నలుపుదనం తగ్గుతుంది.

ఒక చెంచా శనగపిండిలో రెండు చెంచాల వెనిగర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాసి పది నిమిషాలు ఆరిన తరవాత మంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే నల్లని వలయాలు తొలగిపోతాయి.

కలబంద గుజ్జును తీసుకుని చల్లని నీళ్లలో ముంచి దానిని కళ్ల చుట్టూ పట్టించాలి. పదిహేను నిమిషాల తరవాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం రోజులు చేస్తే ఫలితం కనిపిస్తుంది


రెండు చెంచాల బియ్యం పిండిలో మూడు చెంచాల నీళ్లు పోసి ముద్దలా కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ పరచాలి. ఇరవై నిమిషాలు ఆరిన తరవాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే చాలు.

అరకప్పు టమాటా రసంలో రెండు చెంచాల శనగపిండి కలపాలి. ఈ మిశ్రమంతో కళ్ల కింద మర్దన చేయాలి. పది నిమిషాల తరవాత మంచినీళ్లతో శుభ్రం చేసుకుంటే ప్రయోజనం కనిపిస్తుంది.

రాత్రి పడుకునేముందు కళ్ల కింద కొబ్బరి నూనె రాసుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే సమస్య తగ్గుతుంది.


Also Read-Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌కు సారీ చెప్పిన బాలయ్య ‘డాకు’ బ్యూటీ.. మ్యాటరిదే!
Also Read-Madhavi Latha: ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరు లేరమ్మా.. మాధవీ లత షాకింగ్ కామెంట్స్

Updated Date - Jan 23 , 2025 | 04:07 AM