Pregnancy Tips: ఈ సమస్యతో గర్భం దాల్చేదెలా
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:21 AM
పి.సి.ఓ.డి మహిళలను శారీరకంగా, మానసికంగా కుంగదీసే సమస్య! ఈ సమస్యతో వచ్చే ఇన్‌ఫర్టిలిటీని సమర్థంగా అధిగమించాలంటే అందుకు అన్ని విధాలుగా సంసిద్ధులు కావాలి. శరీరంలో అవకతవకలకు గురయ్యే హార్మోన్ల ప్రభావం మూలంగా...
కౌన్సెలింగ్
నాకు పి.సి.ఓ.డి (పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్) సమస్య ఉంది. గర్భం దాల్చడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. నా సమస్య తీరేదెలా?
ఓ సోదరి, విశాఖపట్నం
పి.సి.ఓ.డి మహిళలను శారీరకంగా, మానసికంగా కుంగదీసే సమస్య! ఈ సమస్యతో వచ్చే ఇన్‌ఫర్టిలిటీని సమర్థంగా అధిగమించాలంటే అందుకు అన్ని విధాలుగా సంసిద్ధులు కావాలి. శరీరంలో అవకతవకలకు గురయ్యే హార్మోన్ల ప్రభావం మూలంగా నెలసరి క్రమం తప్పి గర్భధారణకు తగిన సమయాన్ని కనిపెట్టే వీలివ్వని పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటప్పుడు ధైర్యం కోల్పోకుండా వైద్యులను కలవడంతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే....
శరీర బరువును తగ్గించుకోవాలి
ఆరోగ్యకరమైన ఆహార, జీవనశైలులను
అనుసరించాలి
ఒత్తిడిని తగ్గించుకోవాలి
వైద్యులు సూచించే ఇతరత్రా పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలి
ఈస్ట్రోజెన్ మెటాబాలిజంను పెంచే ఆహారం తీసుకోవాలి.
సమర్ధమైన మందులతో హార్మోన్లు సక్రమంగా, సమంగా స్రవించేలా, క్రమం తప్పక అండం విడుదలయ్యేలా చూసుకోవాలి
డాక్టర్ షర్మిలా మజుందార్
సెక్సాలజిస్ట్ అండ్ సైకో అనలిస్ట్
హైదరాబాద్.
ఇవి కూడా చదవండి
రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..
అదృష్టం అంటే ఈమెదే.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..