Share News

Gold Rakhi: బంగారు రాఖీ కొంటున్నారా

ABN , Publish Date - Aug 09 , 2025 | 02:33 AM

రాఖీ.. మన భారతీయ సంస్కృతిలో సోదరీ,సోదరుల మధ్య అనుబంధానికి ఒక ప్రతీక. ప్రతి ఏడాది ఈ పండుగను

Gold Rakhi: బంగారు రాఖీ కొంటున్నారా

సోదరుడి జాతకంలో చంద్రుడి వల్ల కలిగే సమస్యలకు వెండి రాఖీ పరిష్కారమని కొందరు నమ్ముతూ ఉంటారు. అంతే కాకుండా మానసిక ప్రశాంతతకు వెండిని చిహ్నంగా కూడా భావిస్తూ ఉంటారు. ఇక బంగారాన్ని తమ సోదరుడికి ఇచ్చే బహుమతిగా కొందరు భావిస్తూ ఉంటారు. ఇంకొందరు రాఖీ పండుగకు బంగారపు రాఖీలు కొని దాచుకుంటూ ఉంటారు.

వెండి లేదా బంగారు రాఖీలను కొనే ముందు తీసుకో వాల్సిన జాగ్రత్త లేమిటో తెలుసుకుందాం..

  • సాధారణంగా వెండి లేదా బంగారపు రాఖీలు 14 క్యారెట్లు లేదా 18 క్యారెట్లతో తయారుచేస్తారు. ఇలా తయారుచేసిన రాఖీలు ఏవైనా వస్తువులు తయారు చేయించు కోవటానికి వీలుగా ఉంటాయి.

  • రాఖీ కట్టించుకొనే వ్యక్తి వ్యక్తిత్వానికి తగినట్లుగా రాఖీలను కొంటే బావుంటుంది. ఈ మధ్యకాలంలో ‘ఓం’ చిహ్నంతో ఉన్న రాఖీలకు మంచి డిమాండ్‌ ఉంది.

  • కొన్ని రకాల బంగారు లేదా వెండి రాఖీలను పెండెంట్‌ల కింద కూడా వాడుకోవచ్చు.

  • షాపుకు వెళ్లే ముందే ఎన్ని గ్రాముల బంగారం లేదా వెండి రాఖీని కొనాలనే విషయాన్ని నిర్ణయించుకొని వెళ్తే మంచిది.

  • ఈ మధ్యకాలంలో పేరున్న జ్యూయలరీ సంస్థలన్నీ వెండి లేదా బంగారు రాఖీలను విక్రయిస్తున్నాయి. అలాంటి సంస్థల నుంచి కొనుగోలు చేస్తే గ్యారంటీ కూడా ఉంటుంది.

Updated Date - Aug 09 , 2025 | 02:33 AM