Guava Leaves Benefits: జామ ఆకు ప్రయోజనాలెన్నో...
ABN , Publish Date - May 21 , 2025 | 07:37 AM
జామ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, మొటబాలిజం మెరుగుపరచడం నుంచి చక్కెర నియంత్రణ వరకు ఉపయోగపడతాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ ముప్పు తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
జామ పండును పేదల యాపిల్ అని అంటారు. ఎందుకంటే అందులోని పోషకాలు యాపిల్‌కు తీసిపోవు. అయితే జామ పండు వలనే కాదు దాని ఆకుల వలన కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే జామ ఆకులను నేరుగా లేదా జామ ఆకుల టీ లేదా జామ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకోవచ్చు.
జామ ఆకులు మొటబాలిజంను మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
వీటిల్లోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడతాయి. శరీరంలో చక్కెర స్థాయులను, ఆకలిని నియంత్రించి శరీర బరువును తగ్గించడంలో సహాయ పడతాయి.
మహిళల్లో నెలసరి వలన కలిగే నొప్పులను జామ ఆకులు తగ్గిస్తాయి. వ్యాధి నిరోధకతను పెంచుతాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించడంలో జామ ఆకులు బాగా పనిచేస్తాయి. దీని వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
జామ ఆకుల క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను జామ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు నివారిస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News