Chili Powder: కారంలో కల్తీని ఇలా గుర్తించండి..!
ABN , Publish Date - Mar 03 , 2025 | 12:59 AM
వంటకాల్లో కల్తీ చేసిన కారం పొడిని ఉపయోగిస్తే జీర్ణాశయ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. కల్తీని గుర్తించే చిన్న చిట్కాలను ఇలా సూచిస్తున్నారు.
ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా కారం పొడి వేసి బాగా కలపాలి. స్వచ్చమైన కారం నీటిలో కరగదు. అది నీటిపై తేలుతూ ఉంటుంది. ఒక నిమిషం తరవాత గ్లాసు అడుగు భాగాన్ని పరిశీలించాలి. అక్కడ ఎర్రని పొడి చేరి ఉంటే దాన్ని వేళ్లతో తీసుకుని అరచేతిలో వేసుకుని గట్టి రుద్దాలి. గరుకుగా తగిలితే ఇటుక పొడి కలిపినట్లు గుర్తించవచ్చు. గ్లాసు అడుగున మెత్తని తెలుపు రంగు పదార్థం చేరితే సోప్ స్టోన్ పొడి కలిపినట్లు చెప్పవచ్చు. గ్లాసులోని నీళ్లు మరీ ఎర్రగా మారితే ఎరుపు రంగు కలిపినట్లు తెలుసుకోవచ్చు.
వెడల్పాటి పళ్లెంలో ఒక చెంచా కారం పొడి వేయాలి. ఇందులో మూడు చుక్కల టింక్చర్ అయోడిన్ వేసి చెంచాతో కలపాలి. కారం పొడి నీలం రంగులోకి మారితే అందులో గంజి పొడి లేదా ఏదైనా పిండి కలిపినట్లు గుర్తించవచ్చు.
Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..
Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..
Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా