Share News

అగ్రి హార్టి ఫిషరీస్‌ డిప్లొమాలు

ABN , Publish Date - Jun 02 , 2025 | 06:04 AM

డిప్లొమాలు అనేవి ప్రత్యేక రంగాలకు సంబంధించిన ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, నైపుణ్యాలను అందించే కోర్సులు. ఇతర కోర్సుల కంటే డిప్లొమా చేసిన వారు కెరీర్‌లో త్వరగా స్థిరపడగలుగుతారు. మరింత ఆసక్తి ఉన్నవారు...

అగ్రి హార్టి ఫిషరీస్‌ డిప్లొమాలు

డిప్లొమాలు అనేవి ప్రత్యేక రంగాలకు సంబంధించిన ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌, నైపుణ్యాలను అందించే కోర్సులు. ఇతర కోర్సుల కంటే డిప్లొమా చేసిన వారు కెరీర్‌లో త్వరగా స్థిరపడగలుగుతారు. మరింత ఆసక్తి ఉన్నవారు సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తిచేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఫిషరీస్‌, అగ్రికల్చరల్‌, హార్టికల్చర్‌ డిప్లొమా నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

డా.వైఎ్‌సఆర్‌ వర్సిటీ

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న డా.వైఎ్‌సఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీలో 2025-26 సంవత్సరానికి సంబంధించి వర్సిటీ, అనుబంధ కళాశాలల్లో ‘డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌ ప్రోగ్రామ్‌’లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ప్రోగ్రామ్స్‌ వ్యవధి రెండు సంవత్సరాలు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. బోధన పూర్తిగా ఇంగ్లీషులోనే ఉంటుంది.

కోర్సులు

డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌: మొత్తం 352 సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ సీట్లు 220 కాగా, ప్రైవేటు సీట్లు 132. డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌(లాండ్‌ స్కేపింగ్‌ అండ్‌ నర్సరీ మేనేజ్‌మెంట్‌): మొత్తం 55 సీట్లు ఉన్నాయి.

అర్హత: పదో తరగతి పాసై ఉండాలి. (ఇంటర్‌ పాసైనవారు దరఖాస్తునకు అనర్హులు.

వయస్సు: విద్యార్థుల వయస్సు 15 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉండాలి.(2003 ఆగస్టు 31 తేదీ, 2010 ఆగస్టు 31 తేదీల మధ్యలో జన్మించినవారు అర్హులు)

చివరి తేదీ: 2025 జూన్‌ 19

వెబ్‌సైట్‌: https://drysrhu.ap.gov.in/


ఏపీ ఫిషరీస్‌ వర్సిటీ

ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల ‘డిప్లొమా ఇన్‌ ఫిషరీస్‌’ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

డిప్లొమా ఇన్‌ ఫిషరీస్‌: రెండు సంవత్సరాల కాలపరిమితిగల కోర్సు. మొత్తం 385 సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 55 సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో 330 సీట్లు ఉన్నాయి.

విద్యార్హత: పదో తరగతి

వయస్సు: 2025 ఆగస్టు 31 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 2003 ఆగస్టు 31 నుంచి 2010 ఆగస్టు 31 తేదీల మధ్యలో జన్మించి ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 2025 జూన్‌ 20 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు: రూ.800/- (ఎస్టీ/ఎస్సీ/పీడబ్ల్యూబీడీ అభ్యరుఽ్థలకు రూ.400/-)

దరఖాస్తుకు చివరి తేదీ: 2025 జూన్‌ 20

వెబ్‌సైట్‌: apfudiplomaadmissions.aptonline.in/


ఎన్‌జీ రంగా వర్సిటీ

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు, మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 2378 సీట్లు ఉండగా, ఇందులో ప్రభుత్వ కళాశాలల్లో 638, ప్రైవేటు కళాశాలల్లో 1690 సీట్లు ఉన్నాయి.

డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌: రెండు సంవత్సరాల కాలపరిమితి కోర్సు. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు 578, అఫ్లియేటెడ్‌ కాలేజీలో సీట్లు 1420.

డిప్లొమా ఇన్‌ సీడ్‌ టెక్నాలజీ: రెండు సంవత్సరాల కాలపరిమితి కోర్సు. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు 25, అఫ్లియేటెడ్‌ కాలేజీలో సీట్లు 120.

డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌: రెండు సంవత్సరాల కాలపరిమితి కోర్సు. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు 25.

డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌: మూడు సంవత్సరాల కాలపరిమితి కోర్సు. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు 60, అఫ్లియేటెడ్‌ కాలేజీలో సీట్లు 150.

విద్యార్హత: పదో తరగతి

వయస్సు: అభ్యర్థుల వయస్సు 15 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 2003 ఆగస్టు 31 నుంచి 2010 ఆగస్టు 31 తేదీల మధ్యలో జన్మించి ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 16 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు: రూ.800/- (ఎస్టీ/ఎస్సీ/పీడబ్ల్యూబీడీ అభ్యరుఽ్థలకు రూ.400/-)

వెబ్‌సైట్‌: https://polytechnicadmissionsangrau.aptonline.in/

ఇవి కూడా చదవండి

తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..

మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Updated Date - Jun 02 , 2025 | 06:09 AM