Share News

Dubais 1.3 Million Golden Dress: ధగధగలాడే బంగారం డ్రస్‌

ABN , Publish Date - Oct 22 , 2025 | 06:04 AM

బంగారంతో ఆభరణాలతో పాటు దుస్తులూ రూపొందుతూ ఉంటాయి. తాజాగా దుబాయ్‌కు చెందిన అల్‌ రొమోజాన్‌ ఆభరణాల బ్రాండ్‌...

Dubais 1.3 Million Golden Dress: ధగధగలాడే బంగారం డ్రస్‌

బంగారంతో ఆభరణాలతో పాటు దుస్తులూ రూపొందుతూ ఉంటాయి. తాజాగా దుబాయ్‌కు చెందిన అల్‌ రొమోజాన్‌ ఆభరణాల బ్రాండ్‌... పది కిలోల బంగారంతో తొమ్మిదిన్నర కోట్ల ఖరీదైన ‘దుబాయ్‌ డ్రస్‌’ను రూపొందించింది. ఇలాంటి బంగారం దుస్తుల స్ఫూర్తితో ట్రెండ్‌గా మారిపోతున్న గోల్డెన్‌ డ్రస్సుల మీద ఓ లుక్కేద్దామా...

9.5 కోట్ల డ్రస్‌

విలాసాలకూ, సంపదకూ పేరు పొందిన దుబాయ్‌ తాజాగా 21 క్యారెట్ల మేలిమి బంగారంతో తొమ్మిదిన్నర కోట్ల రూపాయల విలువైన బంగారం డ్రస్‌ను రూపొందించి, గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది. పది కిలోల బరువున్న ఈ డ్రస్‌ ప్రపంచంలోనే అత్యంత బరువైన, విలువైన డ్రస్‌గా పేరు తెచ్చుకుంది. ఒక బంగారు కిరీటం, నెక్లెస్‌, నడుముకు తగిలించుకునే హియార్‌ అనే ఆభరణం లాంటి అదనపు హంగులు కూడా ఈ డ్రస్‌కు తోడవడం విశేషం. ఎమిరాటి సంస్కృతిని ప్రతిబింబించేలా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చరిత్ర, వారసత్వాలకు అద్దం పడుతూ చక్కని పనితనంతో, ఆకృతులతో ఈ డ్రస్‌ను ఎంతో కళాత్మకంగా రూపొందించారు.

బంగారం ప్రియులను అలరించేలా...

ఈ దుస్తులకు తగ్గట్టుగా రూపొందించిన బంగారం టియారా 398 గ్రాముల బరువుంటే, నెక్లెస్‌ ఏకంగా 8,810 గ్రాముల బరువుంది. ఇయర్‌ రింగ్స్‌ 134 గ్రాముల బరువున్నాయి. ఇలాంటి అత్యంత బరువైన, విలువైన బంగారం డ్రస్‌ రూపకల్పన... ప్రపంచ నాయకత్వాన్ని చాటుకోవాలనే యుఎఇ ఆశయం ప్రతిబింబించడంతో పాటు దుబాయ్‌ నగరం... బంగారు ఆభరణాల ప్రియుల ప్రధాన గమ్య స్థానంగా ప్రత్యేక గుర్తింపును కూడా పొందగలిగింది. షార్జాలో జరిగిన 56వ మధ్యప్రాచ్య వాచ్‌ అండ్‌ జ్యువెలరీ ప్రదర్శనలో భాగంగా పలు ఆభరణాల కంపెనీలు తమ ఆసక్తికరమైన ఉత్పత్తు లను ప్రదర్శించాయి. 500మందికి పైగా స్థానిక, అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొనగా, ప్రపంచవ్యాప్తంగా 1800 మంది డిజైనర్లు, వర్తకులు వారి ఉత్పత్తులు ప్రదర్శించారు. వీటిలో దుబాయ్‌ డ్రస్‌తో పాటు మూడున్నర కోట్ల రూపాయల వివులైన గోల్డ్‌ ప్లేటెడ్‌ సైకిల్‌ కూడా ఉండడం చెప్పుకోదగిన విశేషం!

Updated Date - Oct 22 , 2025 | 06:04 AM