Share News

ఇంటికి శోభనిచ్చే మనీ ప్లాంట్‌!

ABN , Publish Date - Mar 10 , 2025 | 06:00 AM

చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్‌ పెంచుకుంటూ ఉంటారు. ఈ తీగ అందంగా అల్లుకోవాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...

ఇంటికి శోభనిచ్చే మనీ ప్లాంట్‌!

చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్‌ పెంచుకుంటూ ఉంటారు. ఈ తీగ అందంగా అల్లుకోవాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.

  • మనీ ప్లాంట్‌ని ఏ సైజు కుండీలోనైనా పెంచవచ్చు. పెద్ద కుండీ అయితే ఆకులు వెడల్పుగా వస్తాయి.

  • గాజు సీసాలో నిండుగా నీరు పోసి అందులో ఈ మొక్కను ఉంచినా కూడా బాగా పెరుగుతుంది. పదిహేను రోజులకు ఒకసారి నీళ్లు మారిస్తే చాలు.

  • ఈ మొక్కకు ఎక్కువగా ఎండ తగలకూడదు. కొద్దిగా వెలుతురు ఉంటే చాలు తీగలా చక్కగా పెరుగుతుంది.


  • కుండీలో తరచూ నీళ్లు పోయకూడదు. మట్టి తేమగా ఉంటే చాలు. ఆకులపై కొన్ని నీళ్లు పిచికారీ చేస్తూ ఉంటే అవి పచ్చగా మెరుస్తూ కనిపిస్తాయి.

  • కుండీలో మట్టికి మూడు నెలలకు ఓసారి ఆవుపేడతో తయారుచేసిన సేంద్రీయ ఎరువు కలపాలి.

  • మొక్క మొదళ్లలో నాచుకర్రలు పాతితే వేళ్లకు నిరంతరం తేమ అందుతూ ఉంటుంది. మొక్క పొడవుగా పెరుగుతుంది.

  • ఎండిన, పండిన ఆకులను ఎప్పటికప్పుడు తీసివేస్తూ తీగను అందంగా అమరుస్తూ ఉంటే మొక్క పెరుగుతూనే ఉంటుంది. కుండీ మధ్యలో పొడవాటి కర్రను ఉంచి దాని చుట్టూ తీగను చుడుతూ ఉంటే మొక్క గుబురుగా పెరుగుతుంది. చూడడానికి అందంగా కనిపిస్తుంది.

Updated Date - Mar 10 , 2025 | 06:00 AM