Dharmendra Latest News: ధర్మేంద్ర మరణం.. శ్మశానానికి చేరుకుంటున్న ప్రముఖులు.
ABN , Publish Date - Nov 24 , 2025 | 02:53 PM
ధర్మేంద్ర చివరి చూపు కోసం బాలీవుడ్ మొత్తం తరలి వెళుతోంది. అమితాబ్, అభిషేక్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సంజయ్ దత్‌లు శ్మశానానికి చేరుకున్నారు. ధర్మేంద్ర అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన 10 రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. కొద్దిరోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి జుహూ బంగ్లాకు తీసుకువచ్చారు. ఇంటి దగ్గరే ఆయన చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం ఉదయం ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. 89 ఏళ్ల వయసులో ధర్మేంద్ర తుది శ్వాస విడిచారు.
కుటుంబసభ్యులు ధర్మేంద్ర పార్థివ దేహాన్ని శ్మశానానికి తరలించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ధర్మేంద్ర అంత్యక్రియల్లో పాల్గొనడానికి శ్మశానికి వెళుతున్నారు. బిగ్ బీ అమితాబ్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి శ్మశానికి వెళ్లారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హీరోలు అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, సంజయ్ దత్‌లు కూడా శ్మశానికి చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి
అధికారిక కారును వదిలి.. రాష్ట్రపతి భవన్ వీడిన మాజీ సీజేఐ