-
-
Home » Mukhyaamshalu » Telangana Gram Panchayat Elections Sarpanch Poll News & Results BSB
-
Telangana Gram Panchayat Elections Live: సజావుగా పల్లె పోరు.. ఉదయం 11 గంటలకు ఆయా జిల్లాలో నమోదైన పోలింగ్ శాతమిదే..
ABN , First Publish Date - Dec 14 , 2025 | 07:23 AM
తెలంగాణ రాష్ట్రంలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 4,236 స్థానాల్లో పోలింగ్ జరగుతోంది. ఉదయం 11 గంటలకు పలు జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలివీ...
Live News & Update
-
Dec 14, 2025 12:13 IST
కొమురం భీం జిల్లాలో ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ..
సిర్పూర్(టి) మండలంలోని పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నట్టు ఎస్పీ నితికా పంత్ వెల్లడి
-
Dec 14, 2025 11:50 IST
సిద్దిపేట జిల్లాలో ఉదయం 11 గంటలకు నమోదైన పోలింగ్ ఇదే..
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉదయం 11 గంటలకు 58.43 శాతం పోలింగ్ నమోదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉదయం 11.00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 57.57%
-
Dec 14, 2025 11:43 IST
ఆయా జిల్లాల్లో నమోదైన పోలింగ్ వివరాలిలా...
యాదాద్రి: 11 గంటల వరకు poling 56.51% నమోదు
సంగారెడ్డి జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 59.87% పోలింగ్ శాతం నమోదు
నారాయణపేట జిల్లా ఉదయం 11 గం.వరకు 45.84 శాతం పోలింగ్ నమోదు
జోగులాంబ గద్వాల జిల్లా 11 గంటల వరకు పోలింగ్ శాతం 56.10%
-
Dec 14, 2025 11:38 IST
రెండో విడత పల్లె పోరు.. ఉదయం 11 గంటలకు నమోదైన పోలింగ్ శాతమిదే...
సూర్యాపేట జిల్లాలో ఉదయం 11 గంటలకు పోలింగ్ 60.07 శాతం నమోదు
మెదక్ జిల్లాలో ఉదయం 11 గంటలకు 59.26 శాతం పోలింగ్ శాతం నమోదు
ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో 11 గంటలకు పోలింగ్ 64.32 శాతంగా నమోదు
నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న సర్పంచ్ ఎన్నికలు.. ఉదయం 11 గంటలకు 49.13 శాతం పోలింగ్ నమోదు
-
Dec 14, 2025 11:31 IST
సిద్దిపేట జిల్లాలో పోలింగ్‌ను పరిశీలించిన కలెక్టర్
సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్ పల్లిలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హైమవతి
-
Dec 14, 2025 10:59 IST
నిజామాబాద్ జిల్లా రెండో విడత పల్లె పోరులో స్వల్ప ఉద్రిక్తత
డిచిపల్లి మండలం ధర్మారంలో స్వల్ప ఉద్రిక్తత
ఓ అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోనే ప్రచారం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగిన ప్రత్యర్థి వర్గం
సెంటర్‌లో బైఠాయించి నిరసన
అడ్డుకున్న పోలీసులు
-
Dec 14, 2025 10:55 IST
జోగులాంబ గద్వాల జిల్లాలో ఓటు వేసిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
-
Dec 14, 2025 10:39 IST
సిద్దిపేటలో ఓటుహక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే..
దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మంజుల దంపతులు
-
Dec 14, 2025 10:20 IST
రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 22.54 శాతం పోలింగ్ నమోదు
రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తతలు మినహా సజావుగా రెండో విడత పోలింగ్
ఉదయం 9 గంటల వరకు 22.54శాతం పోలింగ్ నమోదు
-
Dec 14, 2025 10:16 IST
మంచిర్యాల జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థికి గుండెపోటు
తాండూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వెంకటస్వామికి గుండెపోటు
ఆస్పత్రికి తరలింపు..
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న వెంకటస్వామి
-
Dec 14, 2025 10:15 IST
సంగారెడ్డి జిల్లాలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చౌటాకూర్, సుల్తాన్పూర్ గ్రామాల్లోనీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ప్రావిణ్య
పోలింగ్ నిర్వహణ, వికలాంగుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్
-
Dec 14, 2025 10:14 IST
వనపర్తి జిల్లాలో ఓటు వేసిన రాజ్యసభ మాజీ సభ్యుడు
కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న రాజ్యసభ మాజీ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి
-
Dec 14, 2025 10:13 IST
వనపర్తి జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో స్తంభించిన పోలింగ్
చిమనగుంటపల్లిలో ఆగిపోయిన పోలింగ్
8వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి సిలిండర్ గుర్తు బ్యాలెట్ పేపర్‌పై రాకపోవడంతో నిలిచిపోయిన పోలింగ్
-
Dec 14, 2025 10:11 IST
కామారెడ్డి జిల్లాలో పోలింగ్‌ను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి
జిల్లాలోని మోపాల్ పోలింగ్ కేంద్రాన్ని తనికీ చేసిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి
పిట్లంలో ఓటు హక్కు వినియోగించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
ఉదయం 9 గంటల వరకు 20.96 శాతం పోలింగ్ నమోదు
-
Dec 14, 2025 09:30 IST
యాదాద్రి భువనగిరి జిల్లా రొండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీబీనగర్ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.


-
Dec 14, 2025 09:20 IST
నల్గొండ జిల్లాలో ఉదయం 9 గంటలకు నమోదైన పోలింగ్ వివరాలిలా..
నల్గొండ జిల్లాలో 9 గంటల వరకు పోలింగ్ 27.5 శాతం నమోదు
సూర్యాపేట జిల్లాలో 9 గంటల వరకు పోలింగ్ 25.18 శాతం నమోదు
యాదాద్రి జిల్లాలో 9 గంటల వరకు పోలింగ్ 19.45 శాతం నమోదు
-
Dec 14, 2025 09:19 IST
మహబూబాబాద్ జిల్లాలో స్వల్ప ఉద్రిక్తత
తొర్రూరు మండలం అమ్మాపురంలో స్వల్ప ఉద్రిక్తత
పోలింగ్ కేంద్రం దగ్గర గుంపులుగా ప్రచారం చేస్తున్న వారిని చెదరగొట్టిన పోలీసులు
-
Dec 14, 2025 09:17 IST
వరంగల్ జిల్లాలో పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
గీసుకొండలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ సత్య శారద దేవి
-
Dec 14, 2025 08:56 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్
భద్రాద్ది కొత్తగూడెం జిల్లాలో పంచాయతీ ఎన్నికల సరళిని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్
పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు, బందోబస్తు, పోలింగ్ సరళి పరిశీలన
పోలింగ్ కేంద్రాల సందర్శన
-
Dec 14, 2025 08:32 IST
ఖమ్మం జిల్లా: రెండో విడత పోలింగ్‌లో మరో చోట ఉద్రిక్తత..
నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వర్గాల మధ్య ఘర్షణ
ఓ వ్యక్తి కి గాయాలు, రెండు గడ్డివాములు దగ్ధం
-
Dec 14, 2025 08:19 IST
ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత..
కామేపల్లి మండలం పండితాపురం పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన
పండితాపురం పోలింగ్ కేంద్రంలో లో బీఆర్ఎస్ వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ అభ్యర్థులు
పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి ఎవరికి ఓటు వేశారో తమకు చూపించాలంటూ బ్యాలెట్ పత్రాలను చూపించమని ఓటర్లను బీఆర్ఎస్ అభ్యర్థులు ఒత్తిడి చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకుల ఆందోళన
పోలింగ్ బూత్‌లోంచి బీఆర్ఎస్ వార్డు సభ్యులను బయటకు పంపిన పోలీసులు
-
Dec 14, 2025 07:45 IST
కరీంనగర్లో ఏజెంట్ల నిర్లక్ష్యం కారణంగా అక్కడ 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
కరీంనగర్: మానకొండూరులో పాత ఓటర్ లిస్ట్ తీసుకొచ్చిన ఏజెంట్లు
ఏజెంట్ల నిర్లక్ష్యంతో 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
-
Dec 14, 2025 07:28 IST
తెలంగాణలో రెండోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
మ.ఒంటిగంట వరకు పోలింగ్, మ.2గంటల నుంచి కౌంటింగ్
3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు పోలింగ్
సర్పంచ్ పదవులకు 12,834 మంది అభ్యర్థులు పోటీ
వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు
ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం
-
Dec 14, 2025 07:23 IST
తెలంగాణ రాష్ట్రంలో నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 4,332 స్థానాలకు గానూ.. 4,236 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కోర్టు స్టే కారణంగా మిగిలిన 6 స్థానాల్లో ఎన్నికలు జరగడం లేదు.