-
-
Home » Mukhyaamshalu » INSTANT BREAKING NEWS FROM ABN across world on 22nd august VR
-
BREAKING: ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ..
ABN , First Publish Date - Aug 22 , 2025 | 06:08 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 22, 2025 18:35 IST
ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ..
ఈ నెల 25 నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ: మంత్రి నాదెండ్ల
ఈనె 25న 9 జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ: నాదెండ్ల మనోహర్
సెప్టెంబర్ 15 వరకు 4 విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ: మంత్రి నాదెండ్ల
1.45కోట్ల కుటుంబాల ఇళ్లకు వెళ్లి కు స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ
కొత్తగా దరఖాస్తు చేసుకున్న 6.70లక్షల లబ్ధిదారులకీ స్మార్ట్ కార్డులు: నాదెండ్ల
క్యూఆర్ కోడ్ సహా పలు సాంకేతిక అంశాలతో స్మార్ట్ కార్డులు రూపకల్పన
మండలాల వారీగా స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తి.
స్మార్ట్ కార్డులతో డీలర్లు అక్రమాలకు చెక్: మంత్రి నాదెండ్ల
-
Aug 22, 2025 16:08 IST
కూకట్‌పల్లిలో బాలిక హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు ఛేదించిన పోలిసులు.
10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తింపు.
పోలిసుల అదుపులో నిందితుడు.
సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్‌లో ఉంటున్న అబ్బాయి.
దొంగతనం కోసం వెళ్లి బాలిక ఉండడంతో హత్య చేసినట్లు గుర్తింపు.
-
Aug 22, 2025 13:44 IST
వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో నిరాశ
ఎలిగేటర్ అల్కట్రాజ్ నిర్బంధ శిబిరం కూల్చేయాలని ఆదేశం
నిర్బంధ శిబిరంలోకి ఏ వలసదారుడినీ తరలించొద్దని ఉత్తర్వులు
కోర్డు ఆదేశంపై అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించిన ఫ్లోరిడా ప్రభుత్వం
-
Aug 22, 2025 13:44 IST
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు ఉగ్ర సంబంధాలు
విధుల నుంచి తొలగించిన జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
ఇద్దరు ఉద్యోగులు లష్కరే తొయిబాతో కలిసి పనిచేస్తున్నట్లు నిర్ధరణ
-
Aug 22, 2025 12:35 IST
అమరావతి: రేపు కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
పెద్దాపురంలో స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
మ్యాజిక్ డ్రైన్లు, స్వచ్ఛతా రథాలను పరిశీలించనున్న చంద్రబాబు
పెద్దాపురం పూర్ణ కళ్యాణమండపం దగ్గర క్యాడర్ మీటింగ్ నిర్వహణ
సా.5:30 గంటలకు నివాసానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు
-
Aug 22, 2025 12:22 IST
కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై ముగిసిన వాదనలు
మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
మధ్యంతర ఉత్తర్వులు అవసరంలేదన్న హైకోర్టు
జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక..
పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశం
తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
-
Aug 22, 2025 12:01 IST
కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ పిటిషన్
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలిపిన ఏజీ
కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెడుతామన్న ఏజీ
అసెంబ్లీలో ప్రవేశ పెట్టాకే చర్యలు తీసుకుంటామన్న అడ్వకేట్ జనరల్
అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న ఏజీ
-
Aug 22, 2025 11:57 IST
ఢిల్లీ: కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై ఏపీ సీఎం సమీక్ష
ఢిల్లీ నుంచి సీఎస్, డీజీపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఎరువుల లభ్యత, సరఫరా, క్షేత్రస్థాయి పరిస్థితులు సమీక్షించిన సీఎం
కాకినాడ సమీపంలో గ్యాస్ లీక్ ఘటనపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు
-
Aug 22, 2025 11:38 IST
సిట్ అదుపులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
తిరుపతిలో నారాయణస్వామిని అదుపులోకి తీసుకున్న సిట్
లిక్కర్ కేసులో నారాయణస్వామిని ప్రశ్నించనున్న సిట్
లిక్కర్ పాలసీ ఆమోదానికి సంబంధించి ఆరా తీయనున్న సిట్
నారాయణస్వామి పాత్ర కూడా కీలకమని భావిస్తున్న సిట్
విచారణకు రావాలని గతంలో నారాయణస్వామిని కోరిన సిట్
కారణాలు చెబుతూ విచారణకు గైర్హాజరు అవుతున్న నారాయణస్వామి
-
Aug 22, 2025 11:37 IST
విశాఖ: GVMC కౌన్సిల్ సమావేశం రసాభాస
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళన
విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంపై కూటమి, వైసీపీ మధ్య వాగ్వాదం
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్
స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాలంటూ వామపక్ష కార్పొరేటర్ల నినాదాలు
-
Aug 22, 2025 11:10 IST
వీధి కుక్కల తరలింపుపై సుప్రీం త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు
అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు
ఈనెల 11న ఇచ్చిన ఆదేశాలను సవరించిన సుప్రీం ధర్మాసనం
పట్టుకున్న కుక్కలను మరోచోట వదిలేయాలని సుప్రీం ఆదేశాలు
ఇదే సమయంలో రేబిస్, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను..
విడిచిపెట్టవద్దని ఆదేశించిన సుప్రీం ధర్మాసనం
ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేధించిన సుప్రీం
ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశాల్లోనే కుక్కలకు ఆహారం పెట్టాలి
కుక్కలకు స్టెరిలైజ్ చేసి వదిలేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
వీధి కుక్కలను తొలగించే ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌పై తీర్పు
8 వారాల తర్వాత మరోసారి విచారణ చేపట్టనున్న త్రిసభ్య ధర్మాసనం
-
Aug 22, 2025 10:31 IST
తిరుపతి: కార్మికశాఖ జేసీ బాలునాయక్ ఇళ్లలో ACB సోదాలు
కర్నూలు, అన్నమయ్య జిల్లా సహా ఆరు చోట్ల ఏసీబీ తనిఖీలు
బాలునాయక్ బంధువుల ఇళ్లలోనూ కొనసాగుతున్న సోదాలు
-
Aug 22, 2025 10:30 IST
రైతులను రెచ్చగొట్టేలా BRS వ్యవహరిస్తోంది: మంత్రి పొన్నం
42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం: పొన్నం
గౌరవెల్లి ప్రాజెక్టుకు భూసేకరణ జరుగుతోంది: మంత్రి పొన్నం
కేంద్రంపై ఒత్తిడి చేసి రిజర్వేషన్లు సాధించుకుందాం: మంత్రి పొన్నం
-
Aug 22, 2025 09:46 IST
తెలంగాణ ముదురుతోన్న మార్వాడీ గోబ్యాక్ వివాదం
పలు జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన వ్యాపారులు
బంద్ నేపథ్యంలో పలుచోట్ల కొనసాగుతున్న అరెస్టులు
-
Aug 22, 2025 09:24 IST
కేబుల్ వైర్ల వ్యవహారంపై నేడు మరోసారి హైకోర్టులో విచారణ
రామంతాపూర్ ఘటన తర్వాత కేబుల్ వైర్లను కట్ చేసిన అధికారులు
వైర్లకు తిరిగి కనెక్షన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరిన ఎయిర్‌టెల్
-
Aug 22, 2025 09:24 IST
కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై మరోసారి హైకోర్టులో విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్
-
Aug 22, 2025 09:23 IST
నేడు నేషనల్ ఇరిగేషన్ డెవలప్మెంట్ అథారిటీ భేటీ
CWC చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జలసౌధలో సమావేశం
హాజరుకానున్న తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ,..
తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అధికారులు
ఇచ్చంపల్లి రిజర్వాయర్ నుంచి గోదావరి-కావేరీ అనుసంధానంపై చర్చ
బొల్లాపల్లి నుంచి గోదావరి, కావేరి అనుసంధానం కోసం ఏపీ ప్రతిపాదనలు
అనుమతి కోసం కేంద్రం ఒత్తిడి పెంచుతోన్న ఏపీ
-
Aug 22, 2025 08:48 IST
ప్రకాశం బ్యారేజ్‌కి తగ్గిన వరద ప్రవాహం
ఎగువ నుంచి 4 లక్షల 53 వేల 805 క్యూసెక్కుల వరద
తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 15 వేల క్యూసెక్కుల నీరు విడుదల
బ్యారేజ్ గేట్లు అన్ని ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు
-
Aug 22, 2025 08:42 IST
హైదరాబాద్: కూకట్‌పల్లి బాలిక హత్యకేసులో వీడని మిస్టరీ
5 రోజులు గడిచినా ఇంకా లభించని నిందితుడి ఆచూకీ
బాలికను చంపి ఆధారాలు లేకుండా చేసిన నిందితుడు
అనుమానితులను విచారించిన కూకట్‌పల్లి పోలీసులు
-
Aug 22, 2025 08:42 IST
విశాఖ: నేడు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం
స్టీల్‌ప్లాంట్ అంశంపై చర్చకు పట్టుబట్టనున్న వైసీపీ
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ..
ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు
-
Aug 22, 2025 08:24 IST
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు
మ.2 గంటలకు నిర్మలాసీతారామన్‌తో చంద్రబాబు భేటీ
పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరనున్న చంద్రబాబు
మ.3:15కి నీతిఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో భేటీ
సాయంత్రం వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు చంద్రబాబు హాజరు
ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్న సీఎం
రాత్రి అమరావతికి రానున్న సీఎం చంద్రబాబు
-
Aug 22, 2025 07:17 IST
ఢిల్లీ: మ.2 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలతో చంద్రబాబు భేటీ
ఏపీ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని కోరనున్న చంద్రబాబు
మ. 3.15కి నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో చంద్రబాబు భేటీ
ఎకనామిక్ టైమ్స్ 'వరల్డ్ లీడర్స్ ఫోరం' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
-
Aug 22, 2025 07:16 IST
డెయిర్ అల్-బలా: గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 36 మంది మృతి
-
Aug 22, 2025 06:44 IST
ఏపీలో నేడు డీఎస్సీ-2025 మెరిట్ లిస్ట్ విడుదల
అభ్యర్థుల స్కోర్ కార్డుల పరిశీలన తర్వాత..
టెట్ మార్కులు సవరించుకునేందుకు చివరి అవకాశం
-
Aug 22, 2025 06:27 IST
నేడు బిహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులు సహా ఔంటా-సిమారియా బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
-
Aug 22, 2025 06:20 IST
కాకినాడ: యానాంలో ONGC గ్యాస్‌పైప్ లైన్ లీక్
సముద్రం నుంచి యానాం మీదుగా వెళ్లే..
చమురు సంస్థల గ్యాస్‌పైప్ లైన్ నుంచి ఒక్కసారిగా లీక్
భారీగా ఎగిసిపడుతున్న మంటలు
భయందోళ చెందుతున్న సమీప గ్రామాల ప్రజలు
గ్యాస్ సరఫరాను సముద్రంలోనే నిలిపివేసిన చమురు సంస్థల అధికారులు
-
Aug 22, 2025 06:13 IST
నేటి నుంచి సినిమా షూటింగ్‌లు పునఃప్రారంభం
సీఎం రేవంత్‌రెడ్డి జోక్యంతో కొలిక్కి వచ్చిన టాలీవుడ్ వివాదం
18 రోజుల తర్వాత షూటింగ్‌లు షురూ
లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో ఫలించిన చర్చలు
ఫిల్మ్ ఫెడరేషన్, నిర్మాతలతో ఫలించిన లేబర్ కమిషన్ చర్చలు
-
Aug 22, 2025 06:08 IST
నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
పలువురు కేంద్రమంత్రులను కలవనున్న సీఎం చంద్రబాబు