-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latestBreaking news across globe 28th sept 2025 vreddy
-
BREAKING: తుమ్మిడికుంట కబ్జా చేసి N-కన్వెన్షన్ నిర్మించారు: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , First Publish Date - Sep 28 , 2025 | 06:31 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 28, 2025 21:14 IST
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
మావోయిస్టులతో కాల్పుల విరమణ ప్రసక్తే లేదు: అమిత్ షా
మావోయిస్టులు ఆయుధాలు వీడాల్సిందే: అమిత్ షా
లొంగిపోయే మావోయిస్టులకు స్వాగతం పలుకుతాం: అమిత్ షా
లొంగిపోవాలనుకుంటే కాల్పుల విరమణ అవసరం లేదు: అమిత్ షా
లొంగిపోయే మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తాం: అమిత్ షా
-
Sep 28, 2025 20:51 IST
తుమ్మిడికుంట కబ్జా చేసి N-కన్వెన్షన్ నిర్మించారు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలిసో.. తెలీకో.. చెరువున్న చోట హీరో నాగార్జున కన్వెన్షన్ హాల్ కట్టారు: రేవంత్
హైడ్రా కూల్చివేసి వివరాలు చెప్పాక నాగార్జున వాస్తవం గ్రహించారు: రేవంత్
కబ్జా చేసిన రెండెకరాలను ప్రభుత్వానికి నాగార్జున ఇచ్చేశారు: సీఎం రేవంత్
చెరువుల బాగు కోసం సహకరిస్తానని నాగార్జున చెప్పారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
Sep 28, 2025 19:16 IST
29న సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించే దిశగా 10వేల మందితో బతుకమ్మ వేడుక
రేపు సాయంత్రం 4గంటలకు బతుకమ్మ వేడుకలు ప్రారంభం
హాజరుకానున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క
-
Sep 28, 2025 19:16 IST
మరో గంటలో హైదరాబాద్‌లో భారీ వర్షం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక
అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచన
-
Sep 28, 2025 19:16 IST
హైదరాబాద్: అంబర్‌పేట్ బతుకమ్మకుంటను ప్రారంభించిన సీఎం రేవంత్
బతుకమ్మకుంటలో గంగమ్మకు చీర, సారె సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
బతుకమ్మకుంటలో పూడిక తొలగించి చెరువు పునరుద్ధరించిన హైడ్రా
రూ.7 కోట్ల వ్యయంతో 140 రోజుల్లో బతుకమ్మకుంట పనులు పూర్తి: హైడ్రా
బతుకమ్మ కుంటలో భారీఎత్తున బతుకమ్మలను విడిచిపెట్టిన మహిళలు
-
Sep 28, 2025 19:16 IST
TVK చీఫ్ విజయ్‌పై చెన్నై సీపీకి తమిళ సంఘాల ఫిర్యాదు
కరూర్ ఘటనకు విజయ్‌దే బాధ్యత: తమిళ సంఘాలు
విజయ్, TVK నేతలపై చర్యలు తీసుకోవాలి: తమిళ సంఘాలు
-
Sep 28, 2025 19:16 IST
ఆసియా కప్: కాసేపట్లో భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్
ఆసియా కప్ చరిత్రలో 41 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్-పాక్ తుదిపోరు
ఇప్పటి వరకు జరిగిన 16 ఆసియా కప్ టోర్నీల్లో 8 సార్లు విజేతగా భారత్
-
Sep 28, 2025 15:43 IST
TGPSC గ్రూప్-2 ఫలితాలు విడుదల
గ్రూప్-2 ఫలితాలు విడుదల చేసిన TGPSC చైర్మన్
TGPSC గ్రూప్-2లో 783 పోస్టులకు 782 మంది ఎంపిక
-
Sep 28, 2025 13:05 IST
ఇవాళ మధ్యాహ్నం 2.40 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ నివాసానికి సీఎం చంద్రబాబు.
వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న పవన్ ను పరామర్శించనున్న చంద్రబాబు
తాజా రాజకీయ పరిణామాలు పై వీరి మధ్య చర్చ జరిగే అవకాశం
-
Sep 28, 2025 12:00 IST
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపిన దుండగులు
ఎయిర్పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు
ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
-
Sep 28, 2025 11:31 IST
ఫ్యూచర్ సిటీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సీఎంతో పాటు ఫ్యూచర్ సిటీకి బయలుదేరిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి.
కాసేపట్లో రంగారెడ్డి జిల్లా మీర్ ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శంకుస్థాపన చేయనున్న సీఎం
రావిర్యాల నుంచి అమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సీఎం
-
Sep 28, 2025 11:27 IST
తమిళనాడు: తొక్కిసలాట మృతుల కుటుంబాలకు TVK ఎక్స్‌గ్రేషియా
మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటన
క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున పరిహారం
బాధితులకు అండగా ఉంటాం: టీవీకే అధినేత విజయ్
-
Sep 28, 2025 10:23 IST
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం,
నార్త్ కరోలినాలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ సమీపంలో దుండగుడి కాల్పుల్లో ముగ్గురు మృతి,
పలువురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Sep 28, 2025 10:22 IST
అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు పట్ల సీఎం చంద్రబాబు అభినందనలు
అరకు వ్యాలీ కాఫీ మరో ఘనత సాధించింది: సీఎం చంద్రబాబు
ఛేంజ్‌మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించడం శుభపరిణామం
ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగంలో అవార్డు లభించింది: చంద్రబాబు
ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించడం గర్వకారణం: సీఎం చంద్రబాబు
-
Sep 28, 2025 09:35 IST
నేడు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో BRS సభ
BRS జనగర్జన సభకు హాజరుకానున్న కేటీఆర్
-
Sep 28, 2025 09:32 IST
హైదరాబాద్: మూసీకి తగ్గిన వరద.. తేరుకుంటున్న MGBS
MGBS మార్గంలోని శివాజీ బ్రిడ్జిపై పేరుకుపోయిన బురద
MGBSలో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న సిబ్బంది
మధ్యాహ్నం నుంచి MGBSలోకి బస్సులు అనుమతించే అవకాశం
జిల్లాల నుంచి వచ్చే బస్సులను CBS దగ్గర ఉంచుతున్న సిబ్బంది
-
Sep 28, 2025 09:30 IST
నంద్యాల: శ్రీశైలం ఆలయ పరిధిలో డ్రోన్ కలకలం
ఆలయంపై డ్రోన్ ఎగరడాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, పీఎస్‌కు తరలింపు
-
Sep 28, 2025 09:05 IST
యాదాద్రి : జిల్లాలో ఉధృతంగా మూసి ప్రవాహం
జూలూరు- రుద్రవల్లి బ్రిడ్జిపై నుండి మూసి వరద ఉదృతి
పోచంపల్లి -బీబీనగర్ మధ్య నిలిచిన రాకపోకలు.
వలిగొండ మండలం సంగెం- భీమలింగం కత్వ వద్ద పై నుండి ప్రవహిస్తున్న మూసి.
చౌటుప్పల్- భువనగిరి మధ్య రాకపోకలకు అంతరాయం.
భారీ కేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.
-
Sep 28, 2025 09:00 IST
నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన
సీఎం రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించనున్న..
మంత్రులు దామోదర, జూపల్లి, వాకిటి శ్రీహరి
-
Sep 28, 2025 08:40 IST
హైదరాబాద్ : నేడు అంబర్ పేట్ లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి.
భారీ వర్షం కారణంగా గత రెండు రోజుల క్రితమే ప్రారంభోత్సవం కావలసిన బతుకమ్మ కుంట వాయిదా.
సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంట ప్రారంభం
5 ఎకరాల 15 గుంటల స్థలంలో ఉన్న బతుకమ్మ కుంట కు పునరుజ్జీవం పోసిన హైడ్రా
7 కోట్ల 40 లక్షల రూపాయలతో సుందరీకరణ
చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, చుట్టూ వాక్ వే ఏర్పాటు
-
Sep 28, 2025 07:46 IST
ఆసియా కప్: నేడు భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్
రాత్రి 8 గంటలకు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్
ఇప్పటివరకు 8 ఆసియా కప్‌లు అందుకున్న భారత్
ఆసియాకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్ తలపడుతున్న భారత్-పాక్
-
Sep 28, 2025 07:43 IST
తమిళనాడు తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా
తమిళనాడు ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన హోంశాఖ
-
Sep 28, 2025 07:37 IST
తమిళనాడు: కరూర్‌లోని ఆస్పత్రిలో బాధితులకు స్టాలిన్ పరామర్శ
రాజకీయ పార్టీ కార్యక్రమంలో ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి
తొక్కిసలాట ఘటనపై విచారణకు కమిటీ వేశాం: స్టాలిన్
రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ నేతృత్వంలో కమిటీ: స్టాలిన్
కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం: స్టాలిన్
మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున పరిహారం: స్టాలిన్
-
Sep 28, 2025 07:33 IST
నేడు భారత్ ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవం
FCDA భవనానికి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో FCDA భవనానికి శంకుస్థాపన
రావిర్యాల నుంచి అమన్‌గల్ వరకు నిర్మించనున్న..
గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి భూమి పూజ
-
Sep 28, 2025 06:49 IST
తమిళనాడు: కరూర్‌లోని ఆస్పత్రిలో బాధితులకు స్టాలిన్ పరామర్శ
తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 39 మంది చనిపోయారు: స్టాలిన్
రాజకీయ పార్టీ కార్యక్రమంలో ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి: స్టాలిన్
ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం: స్టాలిన్
-
Sep 28, 2025 06:37 IST
విజయవాడ సమీపంలో మాదకద్రవ్యాలు పట్టివేత
గుణదల ప్రాంతానికి చెందిన యువకుడి నుంచి 13 గ్రాములు డ్రగ్స్ స్వాధీనం
బెంగళూరులో కొనుగోలు చేసి విజయవాడలో విక్రయిస్తుండగా పట్టివేత
-
Sep 28, 2025 06:36 IST
శ్రీశైలంలో ఏడో రోజు దసరా మహోత్సవాలు
సాయంత్రం కాళరాత్రి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం
రాత్రి 7 గంటలకు స్వామి అమ్మవార్లకు గజ వాహనంపై గ్రామోత్సవం
-
Sep 28, 2025 06:32 IST
తమిళనాడు: నేడు కరూర్‌లోని ఆస్పత్రిలో బాధితులను పరామర్శించనున్న స్టాలిన్
తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధితులకు సీఎం స్టాలిన్ పరామర్శ
నిన్న TVK అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో తొక్కిసలాట, 38 మృతి
-
Sep 28, 2025 06:31 IST
నేడు తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదల
783 పోస్టుల తుది ఫలితాలు విడుదల చేయనున్న TGPSC