Share News

Final CAT Preparation: క్యాట్‌ ఫైనల్‌ ప్రిపరేషన్‌వేగం, కచ్చితత్వం ప్రధానం

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:13 AM

ఐఐఎం సహా పేరొందిన మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్ష క్యాట్‌(కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌). ఈ టెస్ట్‌లో సాధించిన పర్సంటైల్‌తో...

Final CAT Preparation: క్యాట్‌ ఫైనల్‌ ప్రిపరేషన్‌వేగం, కచ్చితత్వం ప్రధానం

ఐఐఎం సహా పేరొందిన మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్ష క్యాట్‌(కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌). ఈ టెస్ట్‌లో సాధించిన పర్సంటైల్‌తో నేరుగా ప్రవేశం లభించదు. అయితే ఆ కాలేజీలు అడ్మిషన్‌కు సంబంధించి పరిగణనలోకి తీసుకునే ప్రాతిపదికల్లో మొదటిది మాత్రం క్యాట్‌ పర్సంటైల్‌. తొలిసారి ఈ టెస్ట్‌ రాసే అభ్యర్థులు ఒకవైపు ఫైనలియర్‌లో చివరి అంకమైన ప్రాజెక్ట్‌ వర్క్‌ పనిలో ఉంటారు. మరోపక్క గేట్‌, క్యాట్‌ వంటి ప్రవేశ పరీక్షలు, క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టుల బిజీలోనూ ఉంటారు. వీటిలో క్యాట్‌కు పట్టుమని నెల రోజుల గడువు కూడా లేదు. ఈ నేపథ్యంలో క్యాట్‌ తొలిసారి రాస్తున్నవారికి తోడు ఒకింత అవగాహనతో ముందుకు సాగుతున్న వారి వరకు అభ్యర్ధులంతా టెస్ట్‌కు సమర్థంగా సన్నద్ధం కావచ్చు. అందుకు ప్రధానంగా... క్యాట్‌లో అడిగిన అన్ని ప్రశ్నలూ సాల్వ్‌ చేయాల్సిన అవసరం లేదు. 40 నుంచి 50 శాతం ప్రశ్నలను సాల్వ్‌ చేయగలిగితే చాలు, మంచి స్కోర్‌ సాధించవచ్చన్నది నిపుణుల సూచన. క్యాట్‌లో ప్రధానంగా మూడు విభాగాలు - వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌(వీఏఆర్‌సీ), డేటా ఇంట్రప్రెటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌(డీఐఎల్‌ఆర్‌), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌(క్యుఎ) ఉంటాయి. ఒక్కో విభాగానికి సంబంధించి ప్రిపరేషన్‌ ఇలా ఉండేలా చూసుకోవాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (క్యుఎ)

  • ఈ విభాగంలో వేగం అంతకుమించి కచ్చితత్వం ప్రధానం. ఆ రెంటికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మంచి స్కోర్‌ సాధించాలి.

  • అర్థమెటిక్‌, ఆల్జీబ్రా, జామెట్రీ, మోడ్రన్‌ మేథ్స్‌లోని కాన్సె్‌ప్టలను రివైజ్‌చేసుకోవాలి. కాన్సె్‌ప్టలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి.

  • ఈ విభాగం సెక్షనల్‌ మాక్‌ టెస్టులను వారానికి రెండు లేదా మూడు చొప్పున చేయాలి.

  • అన్ని టాపిక్స్‌లో కలిపి ప్రతి రోజూ 30 నుంచి 40 ప్రశ్నలను సాల్వ్‌ చేయాలి.

  • త్వరితగతిని గుర్తుకు తెచ్చుకునేందుకు వీలుగా ఫార్ములా నోట్‌ బుక్‌ను మెయింటైన్‌ చేయాలి.

  • గతం నిర్వహించిన ప్రశ్నపత్రాల్లో తరచూ అడుగుతున్న ప్రశ్నలను పదేపదే సాల్వ్‌ చేస్తుండాలి.


డేటా ఇంట్రప్రెటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌(డీఐఎల్‌ఆర్‌)

  • రోజుకు కనీసం రెండు, మూడు సెక్షనల్‌ మాక్‌ టెస్టులను చేయాలి. ప్రతి సారి సాల్వ్‌ చేయడంలో కష్ట స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాలి.

  • డేటా టేబుల్స్‌, లాజికల్‌ పజిల్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి.

  • ప్రతి సెట్‌కు టైమ్‌ సెట్‌ చేసుకోవాలి. అలా సాల్వింగ్‌ కోసం పట్టే సమాయాన్ని తగ్గించుకోవాలి.

  • ప్రతి మాక్‌ టెస్టులో దొర్లే తప్పులను విశ్లేషించుకోవాలి. సాల్వింగ్‌ నుంచి ఆలోచన, తుది నిర్ణయం వరకు ప్రతి చోట సాధారణంగా ఎదురవుతున్న తప్పులను ఒక దగ్గర నోట్‌ చేసుకోవాలి. అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి.

  • చివరి వారానికల్లా పది, పదిహేను నిమిషాల్లో ప్రతి సెట్‌ను పూర్తి చేయగలగడం అన్నది లక్ష్యంగా పెట్టుకోవాలి. అదే సమయం 80 నుంచి 90 శాతం మేర కచ్చితత్వాన్నీ సాధించాలి.


వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌(వీఏఆర్‌సీ)

  • రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ పాసేజ్‌లను చదవడంలో సరైన పాటవానికి తోడు నిలకడ సాధించాలి.

  • రోజుకు కనీసం మూడు రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ పాసేజ్‌లను చదవడాన్ని అలవాటు చేసుకోవాలి.

  • పారా జంబుల్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి.

  • మాక్‌ టెస్టుల్లో అటు ఆ పరీక్ష, ఇటు వ్యక్తిగత ప్రతిభను సునిశితంగా విశ్లేషించుకోవాలి.

Updated Date - Nov 03 , 2025 | 03:13 AM