Share News

హిందీ బోధనపై వెనక్కి తగ్గిన మహారాష

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:07 AM

ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరి చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది

హిందీ బోధనపై వెనక్కి తగ్గిన మహారాష

మూడో భాషగా ఇతర భారతీయ భాష ఎంపికకు అవకాశం

న్యూఢిల్లీ, జూన్‌ 18: ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరి చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనిపై ప్రతిపక్షాల నుంచి, మరాఠీల నుంచి వ్యతిరేకత రావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో హిందీ తప్పనిసరిగా బోధించాలన్న నిబంధనను తొలగించింది. ఈ మేరకు మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. త్రిభాషా విధానంలో విద్యార్థులు తమ మూడో భాషగా హిందీకి బదులు ఏదైనా భారతీయ భాషను ఎంచుకునే అవకాశం కల్పించింది. అయితే ఆ భాషను నేర్చుకోవాలనుకునేవారు తరగతిలో కనీసం 20 మంది ఉండాలని, అప్పుడే ఆ భాషను పాఠశాలలో బోధిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ విద్యార్థులు అంతకన్నా తక్కువ ఉంటే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామని పేర్కొంది. జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అందులో కచ్చితంగా రెండు భారతీయ భాషలుండాలి.

Updated Date - Jun 19 , 2025 | 03:07 AM