KC Mahindra Education Trust: కేసీ మహీంద్రా స్కాలర్‌షిప్
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:22 AM
మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్‌షిప్ 2025 కోసం కె సి మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ దరఖాస్తులను..
‘మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్‌షిప్-2025’ కోసం కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సులు అభ్యసించేందుకు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు సహాయం చేయడానికి స్కాలర్‌షి్‌పలను అందించనున్నారు.
ఏటా రూ. 10,000 చొప్పున 550 మంది విద్యార్థులకు గరిష్టంగా 3 సంవత్సరాలపాటు ఈ స్కాలర్‌షిప్ అందజేస్తారు.
10/12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలలో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. అలాగే డిప్లొమా కోర్సు కోసం ప్రభుత్వ/ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశం పొంది ఉండాలి. కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు మాత్రమే ఈ స్కాలర్‌షి్‌పనకు అర్హులు.
చివరి తేదీ: 2025 ఆగస్ట్ 27.
వెబ్‌సైట్ : www. kcmet.org