JEE Main Physics Strategy: జేఈఈ మెయిన్ ఫిజిక్స్ ప్రిపరేషన్‌కాన్సెప్ట్ తెలిస్తే కష్టం కాదు
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:19 AM
సబ్జెక్టు పరిజ్ఞానానికి తోడు ప్రాబ్లెమ్ సాల్వింగ్ స్కిల్స్ తెలియాలి. అందుకోసం క్లిష్టమైన వాటిని విశ్లేషించే సామర్థ్యాన్ని అలవర్చుకోవాలి.....
సబ్జెక్టు పరిజ్ఞానానికి తోడు ప్రాబ్లెమ్ సాల్వింగ్ స్కిల్స్ తెలియాలి. అందుకోసం క్లిష్టమైన వాటిని విశ్లేషించే సామర్థ్యాన్ని అలవర్చుకోవాలి.
మొదట సబ్జెక్టుపై సిలబ్‌సకు అనుగుణంగా సంపూర్ణ అవగాహన కలుగజేసుకోవాలి. తదుపరి రెగ్యులర్ ప్రాక్టీ్‌సతో సబ్జెక్టుపై పట్టు లభిస్తుంది.
వారాంతంలో జరిగే పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినప్పటికీ ఇబ్బంది పడాల్సిందేమీ లేదు. ఫెయిల్యూర్‌ను సక్సె్‌సకు తొలిమెట్టుగా భావించాలి. అసలా ప్రశ్నను ఎలా అర్థం చేసుకున్నాం, సమాధానాన్ని కనుగొనే క్రమంలో ఎక్కడ తప్పు దొర్లింది అన్నది తెలుసుకుని, సరైన పద్ధతిలో దాన్ని నేర్చుకోవాలి. ఆ తప్పు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
ఒక సమస్యకు పరిష్కారం కనుగొనే పద్ధతిలో వేగమే కాదు, కచ్చితత్వానికీ ప్రాధాన్యం ఇవ్వాలి.
మార్కుల స్కోర్ పెంపు కోసం
గడచిన ప్రశ్నపత్రాలను విశ్లేషించుకుంటే కొన్ని చాప్టర్లకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు అర్థమవుతుంది. 75 శాతం ప్రశ్నలు 25శాతం చాప్టర్ల నుంచే వస్తున్నాయి. 25 ప్రశ్నలకు అంటే అందులో కనీసం 15 కి సమాధానాలు సరిగ్గా గుర్తించగలిగితే చాలు, సీటు గ్యారంటీ వస్తుంది.
చాప్టర్ల వారీగా అవి.... ప్రశ్నల లెక్కన మోడ్రన్ ఫిజిక్స్(4), కరెంట్ ఎలక్ట్రిసిటీ(3), ఎలకో్ట్రస్టాటిక్స్(2), రే ఆప్టిక్స్(2), మెకానిక్స్(5), వేవ్స్(3), థర్మోడైనమిక్స్(2)
ఎలా చదవాలంటే?
డిసెంబర్ నెలంతా రోజుకు ఒక చాప్టర్ చొప్పున సబ్జెక్టు అంతా చదవాలి.
డివైడ్ అండ్ కాంకర్ అంటే చాప్టర్‌ను అయిదారు భాగాలుగా విభజించుకుని పట్టు సాధించాలి.
కాన్సె్‌ప్టను అర్థం చేసుకునేందుకు షార్ట్ నోట్స్‌ని ఉపయోగించాలి. ప్రాబ్లెమ్‌ని సాల్వ్ చేసే పద్ధతిలో కాన్సె్‌ప్టను అర్థం చేసుకునే పద్ధతిని తెలుసుకోవాలి.
ప్రతి రోజూ పది నుంచి ఇరవై ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేయాలి. ఎక్కడైనా తప్పు దొర్లితే దాన్ని కనీసం అయిదారు సార్లు ప్రాక్టీస్ చేయాలి.
ప్రతి అదివారం పుల్ సిలబ్‌సపై ఒక మోడల్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి.
నెగెటివ్ మార్కులు రాకుండా జాగ్రత్త పడాలి. టైమ్ మేనేజ్‌మెంట్ ముఖ్యం. ర్యాండమ్ వీడియోలు చూసి టైమ్ వృథా చేసుకోవద్దు.
ప్రిపరేషన్ మొదటి రోజు నుంచి మార్కులు అని కాకుండా సబ్జెక్టుపై దృష్టి పెట్టడం మంచిది.
సీటు తెచ్చుకోవడం ఎంత మాత్రం మేజిక్ లేదంటే లక్ కాదని విద్యార్థులు గ్రహించాలి. ఎంతో కృషి ఉంటేనే అనుకున్న సీటు లభిస్తుందని తెలుసుకోవాలి.
రెండు రకాలు
మొదటిది కాన్సె్‌ప్టను అర్థం చేసుకోవడం. అందుకు ఎన్‌సీఈఆర్‌టి పుస్తకాలతో సొంత నోట్స్‌ను రూపొందించుకోవాలి.
కాన్సె్‌ప్టను నేర్చుకునేందుకు థియరీ ఓరియెంటెడ్ మెటీరియల్ చాలు. రేఖా చిత్రాలు, చార్టులు, టేబుల్స్‌తో కాన్సె్‌ప్టను అర్థం చేసుకోవాలి.
ప్రతి చాప్టర్‌పై ఒకట్రెండు పేజీల మేర షార్ట్ నోట్స్‌ను తయారు చేసుకోవాలి.
కాన్సెప్టును గుర్తుంచుకోవడంలో విజువలైజేషన్ టెక్నిక్స్, టిప్స్ సహాయపడతాయి.
ఫార్ములా లేదా చార్టులను గుర్తుంచుకోవడంలో న్యూమానిక్స్(జ్ఞప్తికి తెచ్చుకోవడం) కీలకం. ఉదాహరణకు ఈండబ్ల్యు చాప్టర్‌లో ఎప్పుడూ ఒక ప్రశ్న వస్తుంది. చాలా సార్లు ఈ ప్రశ్న ఈండబ్ల్యుకు సంబంధించిన వేవ్‌లెంథ్/ ఫ్రీక్వెన్సీ శక్తి ఆర్డర్‌పైన ఉంటుంది. ఉదాహరణకు - రేడియో వేవ్స్ - మైక్రో వేవ్స్ - ఇన్‌ఫ్రారెడ్ రేస్ - విజిబుల్ రేస్ - అలా్ట్రవయలెట్ రేస్ - ఎక్స్ రేస్ - గామా(ఆర్) రేస్ - కాస్మిక్ రేస్
దీనిని గుర్తుంచుకునేందుకు..... రెడ్ మార్షియన్స్ ఇన్వేడెడ్ వీనస్ యూజింగ్ ఎక్స్‌రే గన్ లేదా మా ఇంటికి వచ్చి ఉండు ఇష్టం లేకపోతే రాకు అన్న పద్ధతి ఉపయోగించాలి.
ఇదే విధంగా రేడియో యాక్టివ్ సిరీస్ ఆర్డర్‌ను గుర్తుంచుకోవచ్చు. ధోరియం సిరీ్‌స(4ఎన్), నెప్టూనియమ్ సిరీ్‌స(4ఎన్+1), యురేనియమ్ సిరీ్‌స(4ఎన్+2), యాక్టీనియం సిరీ్‌స(4ఎన్+3). దీని కోసం సినిమా రంగం ఆంధ్రలోకి ఎలా వచ్చిందో చెబితే సరిపోతుంది. తమిళనాడు(టిఎన్) ఉత్తర ఆంధ్ర(యుఎ) - రివర్స్‌లో ఆంటే - ఎయుఎన్‌టి అని గుర్తుంచుకోవచ్చు.
రెండోది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. ప్రాబ్లెమ్‌ను పూర్తిగా చదవాలి. దానికి సంబంధించిన ఫార్ములా ఉపయోగించాలి. రోజుకు ఒకటి రెండు గంటలు న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయాలి. గడచిన అయిదేళ్ళ ప్రశ్నపత్రాలను సాల్వ్ చేస్తే సంపూర్ణ అవగాహన కలిగించుకోవచ్చు.