Indian Railways Announces Mega Recruitment: రైల్వేలో మెగా రిక్రూట్‌మెంట్
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:10 AM
భారతీయ రైల్వే వివిధ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి. వివిధ అర్హతలకు...
భారతీయ రైల్వే వివిధ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి. వివిధ అర్హతలకు తోడు నిర్దేశిత ఎంపిక ప్రకియ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. సంక్షిప్తంగా ఆ వివరాలు దిగువ ఇస్తున్నాం.
నాన్‌టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (అండర్ గ్రాడ్యుయేట్)
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2424
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 394
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 163
ట్రైనీ క్లర్క్: 77
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబర్ 27
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్)
కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్: 161
స్టేషన్ మాస్టర్: 615
గూడ్స్ రైలు మేనేజర్: 3416
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 921
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 638
ట్రాఫిక్ అసిస్టెంట్: 59
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు ఇంగ్లీష్/హిందీ టైపింగ్‌లో ప్రావీణ్యం ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత టెస్ట్(టైర్ 1, టైర్ 2)కు తోడు టైపింగ్ స్కిల్‌టెస్ట్/కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబర్ 20
ఇంకొన్ని
జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకూ నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా/ బీఎస్సీ డిగ్రీ పాసై ఉండాలి.
ఎంపిక: రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రైల్వే మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబర్ 20