Share News

BITS Pilani admission test: విలక్షణ సంస్థ బిట్స్‌ పిలానీ

ABN , Publish Date - Dec 29 , 2025 | 06:30 AM

ఇంజనీరింగ్‌ విద్యను అందించడంలో విలక్షణ సంస్థగా పేర్కొన్నదగ్గ వాటిలో బిట్స్‌(బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌)పిలానీ ఒకటి...

BITS Pilani admission test: విలక్షణ సంస్థ బిట్స్‌ పిలానీ

అడ్మిషన్‌ టెస్ట్‌కు నోటిఫికేషన్‌

ఇంజనీరింగ్‌ విద్యను అందించడంలో విలక్షణ సంస్థగా పేర్కొన్నదగ్గ వాటిలో బిట్స్‌(బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌)పిలానీ ఒకటి. రాజస్థాన్‌లోని పిలానీలో ఇది మొదట ఏర్పాటైంది. తదుపరి హైదరాబాద్‌, గోవాల్లో ఆరంభించినవి కూడా బిట్స్‌ పిలానీ పేరుతోనే కొనసాగుతున్నాయి. బిట్స్‌ పిలానీకి ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ అలాంటిది అని ప్రత్యేకించి పేర్కొనాల్సిన అవసరం లేదు.

  • ఇంటర్‌ తరవాత చేర్చుకునే ఇంజనీరింగ్‌ తదితరాలను ఇక్కడ ఫస్ట డిగ్రీ ప్రోగ్రామ్‌ అంటారు. నోటిఫికేషన్‌, ప్రవేశ పరీక్ష(బిట్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌) ఫస్ట్‌ డిగ్రీలో చేరేందుకే ఉంటుంది.

  • బిట్స్‌ అందించే ఎమ్మెస్సీ(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మేథమెటిక్స్‌, ఎకనామిక్స్‌, సెమికండక్టర్‌, నానోసైన్స్‌)లో చేరిన అభ్యర్థులు మొదటి సంవత్సరం పూర్తి చేసిన తరవాత ఇంజనీరింగ్‌ డ్యూయల్‌ డిగ్రీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ కేటాయింపు డిగ్రీ మొదటి ఏడాది కోర్సులో కనబరిచే ప్రతిభ ఆధారంగా ఉంటుంది.

  • అడ్మిషన్‌ టెస్ట్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా ఇక్కడ బీఈ, ఎమ్మెస్సీ, బీఫార్మసీలో చేరే అభ్యర్థులు జాయింట్‌ కొలాబిరేటివ్‌ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. ఆమెరికా, ఆస్ట్రేలియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో కలిసి వీటిని బిట్స్‌ అందిస్తోంది. దీంట్లోకి అర్హత పొందిన విద్యార్థులు ఇక్కడ రెండేళ్ళు, అక్కడ రెండేళ్ళు కలిపి మొత్తం నాలుగేళ్ళ ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తిచేయవచ్చు.

  • బిట్స్‌ పిలానీ క్యాంప్‌స(బీఈ-కెమికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మాన్యుఫాక్చరింగ్‌, మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సస్టయినబిలిటీ), బీఫార్మసీ, ఎమ్మెస్సీ(బయలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, సెమికండక్టర్‌ అండ్‌ నానోసైన్స్‌) అందిస్తోంది.


  • బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంప్‌స(బీఈ-కెమికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సస్టయినబిలిటీ), బీఫార్మసీ, ఎమ్మెస్సీ(బయలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, సెమికండక్టర్‌ అండ్‌ నానోసైన్స్‌) అందిస్తోంది.

  • బిట్స్‌ పిలానీ గోవా క్యాంప్‌స(బీఈ-కెమికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌, మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సస్టయినబిలిటీ), ఎమ్మెస్సీ(బయలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, సెమికండక్టర్‌ అండ్‌ నానోసైన్స్‌) అందిస్తోంది.

  • బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీతో ఇంటర్‌ ఉత్తీర్ణులు బీఫార్మసీ, బీఈ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సస్టయినబిలిటీ ఇంజనీరింగ్‌ ప్రోగ్రామ్‌లో చేరేందుకు అర్హులు. మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీతో ఉత్తీర్ణులు ఇంజనీరింగ్‌ ప్రోగ్రామ్స్‌ అన్నింటిలో చేరవచ్చు. 75 శాతం మార్కులు అందునా గ్రూపు సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.

  • అడ్మిషన్‌ టెస్ట్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. ఫిజిక్స్‌ నుంచి 30, కెమిస్ట్రీ నుంచి 30, మూడో విభాగంలో ఎ కింద ఇంగ్లీష్‌ ప్రొఫిసియెన్సీ నుంచి 10, బి కింద రీజనింగ్‌ నుంచి 20 చివరిగా మ్యాథ్స్‌/బయాలజీ నుంచి 40 మొత్తం 130 ప్రశ్నలు ఉంటాయి. కాలవ్యవధి మూడు గంటలు. సమాధానం కరెక్ట్‌ అయితే 3 మార్కులు ఇస్తారు. తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు తగ్గిస్తారు. గడువులోపు ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు గుర్తిస్తే ఒక్కో విభాగం నుంచి 3 చొప్పున మొత్తం 12 ప్రశ్నలు అదనంగా కూడా ఇస్తారు. ఇదిపూర్తిగా ఆన్‌లైన్‌ పరీక్ష. ఈ టెస్ట్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఫీజులో రాయితీ నిబంధనలకు లోబడి ఉంటుంది.

  • బిట్స్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ రెండు విడతలుగా జరుగుతుంది. మొదటి సెషన్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి 17 వరకు, రెండో సెషన్‌ మే 24 నుంచి 26 వరకు జరుగుతాయి. మార్చి 16లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  • వెబ్‌సైట్‌: https://admissions.bits-pilani.ac.in/

Updated Date - Dec 29 , 2025 | 06:31 AM