Share News

Nature Poem: మహాయానం

ABN , Publish Date - May 19 , 2025 | 12:11 AM

ఆకుల నీడలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు మౌనంగా కాలాన్ని ఆస్వాదిస్తున్నారు. వారితో పాటు శబ్దం, మౌనం, దూడ అరుపు కలిసి ఒక కలల ప్రయాణంగా మారుతుంది.

Nature Poem: మహాయానం

ఆకులు అరమోడ్చిన చెట్టు కింద

కళ్లుమూసుకుని కూర్చున్నారిద్దరు

మధుపాత్రల్లో మౌనాన్ని నింపుకుని

కళ్లచెట్టు రెప్పల కింద నీడల్లో

పాకుతున్న లేత ఎండని

కళ్లుమూసుకుని సిప్ చేస్తుండగా

వాళ్లని విప్పారిన కళ్లతో చూస్తూ

మధుపాత్రల్లో తేలే తెల్లమబ్బులు

దూరంగా ‘అంబా’ అనే దూడ అరుపు

శబ్దం ఇద్దరు మనుషుల్ని కలుపుతుంది

ఇద్దరి మధ్య మౌనం పొరల్లోకి

చేరినిద్రపోతుంది

దిక్కుల్లేని నిశ్శబ్ద సాగరం మీద

తెడ్లు లేని పుట్టె శబ్దం

దానిలో చెట్టుతో సహా ఇద్దరు మనుషులూ

ఒక దూడా

తెల్లమబ్బులతో కలిసి తేలుతూ తూలుతూ

ప్రయాణం

ఒక కల నుంచి ఇంకో కలలోనికా?

లేదా... ఒక మెలకువ నుండి ఇంకో

మెలకువలోనికా?

వసీరా

91777 27076

Updated Date - May 19 , 2025 | 12:14 AM