Share News

Social Decay: అరాచకాలకు అంతమే లేదా

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:48 AM

ఒంటరి పిల్ల కనిపిస్తే కాటువెయ్యడం మాటువేసి మట్టుపెట్టి మాయం చేయడం

Social Decay: అరాచకాలకు అంతమే లేదా

ఒంటరి పిల్ల కనిపిస్తే కాటువెయ్యడం

మాటువేసి మట్టుపెట్టి మాయం చేయడం

హత్యలకు ఇక హద్దే లేదు

ఆత్మహత్యలు ఆగేది లేదు

మానవత్వం మసకబారుతుంది

అమానుషం పెచ్చుమీరుతుంది

అరాచకాలకు అంతమే లేదా?

ఆదిమానవులే నయం కాదా!


అరచేతిలో అశ్లీలమా

అధ్యాపకులే కీచకులా

బంధువులే రాబందులా


అమ్మలాంటి ఆడది కనిపించినా

చెల్లిలాంటి చిన్నారి అన్నా

అని పిలిచినా గురువులే దైవమని భావించినా

పూజారే దేవుడని ప్రార్థించినా

పూనకం వచ్చినట్టు ఊగిపోవడం

పశువు కన్నా హీనంగా ప్రవర్తించడం


పరితాపం లేదు

పరివర్తన కలుగదు

ప్రాయశ్చిత్తం చేసుకోరు

కన్ను మిన్ను కానని కామాంధులు

కఠిన దృష్టి సారించాలి పాలకులు

మీ మీదే పెట్టుకున్నారు ప్రజలు ఆశలు

– నన్నపనేని రాజకుమారి

Updated Date - Jul 26 , 2025 | 12:48 AM