Share News

Social Awareness Telugu Poem: ప్రశ్నలు లేవనెత్తే చోట

ABN , Publish Date - May 19 , 2025 | 12:23 AM

ఈ కవిత సమాజంలోని ప్రతి రంగంలో – విద్య, వ్యవసాయం, న్యాయం, శ్రమ – సామూహిక బాధ్యతను గుర్తుచేస్తూ కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిస్తుంది. ప్రతి స్థలాన్ని పోరాట వేదికగా చేసి, శ్రామికుల సంఘీభావంతో మార్పుకు నాంది పలుకుతుంది.

Social Awareness Telugu Poem: ప్రశ్నలు లేవనెత్తే చోట

ప్రశ్నలు లేవనెత్తే చోట

జవాబుల్లో కలుద్దాం,

విగ్రహాలతో కాదు

మనం పుస్తకాల్లో కలుద్దాం!

పంటలతోపాటు పొలాల్లో కలుద్దాం,

పండించే రైతులకు తోడుగా

మనం రైతులతో కలుద్దాం!

కోర్టులు కచ్చేరీలలో కలుద్దాం

గ్రంథాలయాల్లో కలుద్దాం,

పేదల అందుబాటు న్యాయానికై

నిలబడే వకీళ్లతో కలుద్దాం!

బడులు మదర్సాలలో కలుద్దాం

కాలేజీలు యూనివర్సిటీలలో కలుద్దాం,

దేశాభివృద్ధికి దారిచూపే

చదువు చెప్పే చోట కలుద్దాం!


విద్య అందరి హక్కు అనే

పని అందరికి కావాలనే,

కోట్లాది విద్యార్థుల్లో కలుద్దాం

కోట్లాది నవయువకులతో నడుద్దాం!

కొత్త సవాళ్లు ఎదురైతే సమాధానాలలో కలుద్దాం

పోరాటాల మైదానాల్లో

పంటపొలాలు కార్ఖానాల్లో

అధికారానికై పిడికిలి బిగించే

శ్రామికులతో ఏకమవుదాం!

- నిఖిలేశ్వర్‌

91778 81201

Updated Date - May 19 , 2025 | 12:26 AM