Trump Administration: బుద్ధిజీవులపై బుద్ధిలేని చర్య
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:36 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, హెచ్ 1బీ వీసా ఫీజును ఎకాఎకీ ఆరు రెట్లు లక్ష డాలర్లకు పెంచి, దాన్ని వెంటనే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించడం భారత్‌లో...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, హెచ్–1బీ వీసా ఫీజును ఎకాఎకీ ఆరు రెట్లు (లక్ష డాలర్లకు) పెంచి, దాన్ని వెంటనే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించడం భారత్‌లో ప్రకంపనలు రేపుతోంది. భారత్‌లో అలజడి ఎందుకంటే ఆ తరహా వీసాదారుల్లో డెబ్భై శాతం మంది మనదేశం వారే. ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. అమెరికాను తమ ఉద్యోగక్షేత్రంగా ఆశించే విదేశీయువత ఆశలపై ఇది నీళ్లు జల్లడమే. ప్రపంచీకరణ యుగంలో నాడు మేధో వలసల్ని ప్రోత్సహించడం, ఆకర్షించడం ద్వారా పలు దేశాల బుద్ధిజీవుల వల్ల అమెరికా ప్రగతి సాధించింది. నేడు విదేశీ ఉద్యోగుల వల్ల తమ యువతకు, ప్రగతికి నష్టం వాటిల్లుతోందని శాపనార్థాలు పెడుతూ, సామాజిక వైముఖ్యాన్ని పెంచుతోంది. ఇది ప్రమాదకర చర్య. ఇతర దేశాలపై ఆధారపడకుండా మనదేశం మన యువశక్తిని సంపూర్ణంగా వాడుకునేటట్లు తయారుకావాలి. ఆ దిశగా నూతన విధానాలననుసరిస్తూ దేశీయ పరిస్థితులను చక్కదిద్దాలి. యువశక్తి మెండుగా ఉన్న మన దేశానికి రానున్న పాతికేళ్లు ఎంతో కీలకం. విద్యావిధానం, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పనలపై పాలకులు దృష్టిపెడితే ప్రపంచ దేశాల అస్థిరపు విధానాల ప్రభావం మనపై తగ్గుతుంది.
--డా. డీవీజీ శంకరరావు మాజీ ఎంపీ