Share News

Human Relationships: గరిక పూలు

ABN , Publish Date - Aug 04 , 2025 | 06:07 AM

వెంటాడడంలో నీడకీ జ్ఞాపకానికీ పోటీ పెడితే,

Human Relationships: గరిక పూలు

1.jpg

వెంటాడడంలో నీడకీ

జ్ఞాపకానికీ పోటీ పెడితే,

ఓటమెప్పుడూ నీడదే!


2.jpg

పూలతోటలోకి నీ ప్రవేశాన్ని

నిషేధిస్తున్నాను! ఏది పువ్వో

ఏది నువ్వో తేల్చుకోలేక!


3.jpg

అతను,ఆమె ఆత్మహత్య చేసుకున్నారు!

ఒకరి ఫోన్లో ఒకరు

మారుపేర్లతో మిగిలిపోయారు!


4.jpg

నువ్వెంత ఇష్టం అంటే

నీతో కలిసి నడిచిన దారుల్లో

ఒక్కణ్ణే తిరగలేనంత!


5.jpg

జీవితం పుల్లఐస్ బండి లాంటిది!

దాని వెనకాలే పరిగెత్తే పిల్లలం మనం!


6.jpg

కూలిన చెట్టుకింద..

నీడముక్కలైన శబ్దం!


7.jpg

నా మనసులోతట్టు ప్రాంతంలో ఉందో ఏమో

తరచూ నీ జ్ఞాపకాలముంపుకి గురౌతూనే ఉంటుంది!


8.jpg

ఆటబొమ్మలు దిగాలుగా చూస్తున్నాయి

జ్వరం వచ్చిన పాపాయిని!

-భాస్కరభట్ల

bbpoet@gmail.com

Updated Date - Aug 04 , 2025 | 06:07 AM