Language Integration: సంస్కృతం మార్కుల భాష కాదు
ABN , Publish Date - May 02 , 2025 | 06:32 AM
సంస్కృతం కేవలం మార్కుల కోసం నేర్పే భాష కాకుండా, అది ఒక పవిత్ర భాషగా భావించాలి. తెలుగు, సంస్కృత భాషల కలయిక విద్యార్థుల మేధస్సును వికసించించే మార్గం.
సంస్కృతం.. మార్కుల భాష కాదు తెలుగు పండితులారా! సంస్కృతం కేవలం మార్కుల భాష అని తక్కువ చేయకండి. ఇటీవలి కాలంలో కొందరు సంభాషణా సంస్కృతంపై అవగాహన లేనివారు, భావోద్వేగంతో కూడిన కొందరు తెలుగువేత్తలు ‘‘సంస్కృతం మార్కుల కోసం నేర్పే భాష మాత్రమే’’ అని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఒక దుష్ర్పచారమే కాకుండా, ఒక పవిత్ర భాష ప్రతిష్ఠను అపహసించే వాదన. తెలుగు, సంస్కృత భాషలు– ఒకటి అపూర్వమైన మాధుర్యం, మరొకటి ఆలోచనల అమృతం. ఈ రెండు భాషల్ని నేర్చుకునే విద్యార్థికి జీవితం భవితవ్యంగా మారుతుంది. మేధస్సు వికాసమవుతుంది. సంభాషణ సంస్కృతాన్ని మనం నేర్చుకుంటేనే మన విద్యార్థులకు మూలభాషల గొప్పతనం, భావవ్యక్తీకరణ నైపుణ్యం బోధించగలం. మన సంస్కృతి, గౌరవం, భవితవ్యాన్ని నిలబెట్టే మార్గం తెలుగు, సంస్కృత భాషల కలయిక. మనం ఈ రెండింటినీ విభేదింపజేయకుండా ఒకదానినొకటి పోషించేలా భావి దిశను నిర్దేశించాలి.
– నటరాజ్