Environmental Conservation: కన్నీళ్ల బాష్పోత్సేకం
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:17 AM
పర్యావరణ పరిరక్షణలో అక్షరాలుపై భారం వహించిన వనజీవి రామయ్య సేవలకు స్మారకంగా తెలంగాణ అటవీ యూనివర్సిటీ పేరు మార్పు

వృక్షాలు విలవిల్లాడుతున్నాయి పచ్చని ఆకులన్నీ కన్నీళ్లు రాలుస్తున్నాయి తల్లి వేరు శోకాలు తీస్తున్నది పర్యావరణం మౌనం దాల్చి నిలుచున్నది
విత్తనం వేసిన చెయ్యి నిలిచిపోయి మొక్కలు పెంచిన జీవి ఆగిపోయింది అడవి దుఃఖంతో అతలాకుతలమవుతున్నది చెట్టు చేమా బాధతో తలవంచింది
కోట్ల మొక్కలకు ప్రాణం పోసిన దరిపెల్లి రామయ్య తల వాల్చిండని వనంలోని ఆకులన్నీ కన్నీళ్ల బాష్పోత్సేకం
– అన్నవరం దేవేందర్
ఆ వర్సిటీకి ‘వనజీవి’ పేరు పెట్టాలి
దాదాపు 50 ఏళ్లకు పైగా పర్యావరణ పరిరక్షణకు జీతం లేని సైనికుడిగా జీవితాంతం పనిచేసి, తుది శ్వాస విడిచిన వనజీవి రామయ్య పేరును తెలంగాణ అటవీ యూనివర్సిటీకి పెట్టాలి. కనపడ్డ చోటల్లా చెట్లు నాటి, పచ్చదనం మించిన ధనం లేదని ఎంతో మందిని చైతన్యవంతులను చేసిన పద్మశ్రీ రామయ్య లేకపోవడం బాధాకరం. ఆయన సేవలకు గుర్తుగా ప్రస్తుత తెలంగాణ అటవీ యూనివర్సిటీ పేరును ‘పద్మశ్రీ వనజీవి రామయ్య తెలంగాణ పర్యావరణ, అటవీ యూనివర్సిటీ’గా నామకరణం చేయాలి. కోటికి పైగా మొక్కలు నాటడం ఒక రికార్డ్. ఆయనను ఆ విధంగా స్మరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
– అన్నవజ్జుల కశ్యప