Share News

Story Telling in Poetry: రే....

ABN , Publish Date - May 12 , 2025 | 03:54 AM

ఈ కవిత ఒక వ్యక్తి అనుభవాలను, యుద్ధం, జ్ఞానం, కథలు, పూర్వీకుల జ్ఞానం మరియు ఆధునిక సమాజంలో జరిగిన పరిణామాలను ప్రతిబింబిస్తుంది. కవితలో ఒక నిర్దిష్ట స్ఫూర్తి, జ్ఞానం, యుద్ధం మరియు జీవన విలువలపై భావనలను వ్యక్తం చేస్తుంది.

 Story Telling in Poetry: రే....

నేను కథలు రాయను

మీతో కలిసి థూలా ఆడతాను

కంప్యూటర్‌ బ్యారల్‌పైకి కాకమ్మలను పిలుస్తాను

కదనంలో ఉన్నపుడు కనులపైకి

కలలనూ వాలనీయను అవును.. అవును.. నిజమే.. నిజమే.. అంటూ

తెలియని విద్యలు ఇక్కడ ప్రదర్శించలేం!

యుద్ధాన్ని యుద్ధంగానే చేయాలి

ఆదరాబాదరాగా పుస్తకం తిప్పేసినట్టు కాదుగా

పలకని అంబకు ప్రామ్టింగ్‌ ఇచ్చినట్టు కాదుగా

వెయ్యొక్క నేత్రాలు, లక్షన్నర నక్షత్రాల కింద ఉన్నాం

ఎక్కడ దాక్కుంటాయి మన కొంచతనాలు...

ఆదివాసీ రేలా రాత్రి రెయిడ్‌ను

కతలు కతలుగా చెబుతుంది

పట్టణ రేణుక రేగే దుమ్ములో చెంగున

దూకే లేగలతో పందెం వేస్తుంది

జ్ఞానం చెట్టు కింద దొరికేదీ,

పండులా రాలేదే అయితే..

ఎన్నెన్ని ఛత్రచ్ఛాయల వైబ్రెంట్‌ అద్భుతమీ అడవి?

గట్టిగిట్టల కింద చరిత్ర పొందిన నునుపు చూద్దుమా!

పుట్టుకది ఏముందిలే అనుకోలేం


అందర్‌ బహర్‌ ఒకటే రొద

ఎక్కడైనా ఉండేదేగా ఈ కథ! కానీ, మా కథలు కంచెలూ, బ్యారక్‌లూ,

డ్రోన్ల పహారాలూ, వేల పర్లాంగులూ దాటేస్తాయి

సర్వనామ రూపసి ఈ యుద్ధంలాగే...

నేను కథలు రాయను

నిజం చెప్పొద్దూ!

పిలిస్తే చొప్పున మీ కథలో చేరిపోతా!

-రివేరా

Updated Date - May 12 , 2025 | 03:54 AM