Share News

Gender Studies Graduates: జెండర్ స్టడీస్‌ విద్యార్థులను అర్హులుగా గుర్తించాలి

ABN , Publish Date - Nov 06 , 2025 | 05:04 AM

తెలంగాణలో గతంలో కాకతీయ యూనివర్సిటీ, ప్రస్తుతం హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలు ‘ఎంఏ జెండర్ స్టడీస్’ కోర్సును నాణ్యతతో బోధిస్తున్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం ఉద్యోగ రహితులుగా...

Gender Studies Graduates: జెండర్ స్టడీస్‌ విద్యార్థులను అర్హులుగా గుర్తించాలి

తెలంగాణలో గతంలో కాకతీయ యూనివర్సిటీ, ప్రస్తుతం హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలు ‘ఎంఏ జెండర్ స్టడీస్’ కోర్సును నాణ్యతతో బోధిస్తున్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం ఉద్యోగ రహితులుగా ఉన్నారు. కారణం ఆయా నియామకాలలో ఈ కోర్సు పేరు లేకపోవడమే. ఈ విద్యార్థులందరూ ప్రభుత్వ ప్రాజెక్టులు, మహిళా కమిషన్‌లు, ఉమెన్ సేఫ్టీ వింగ్‌లలో పనిచేసే అవకాశం కోరుతున్నారు. ఇది కేవలం ఉద్యోగ రహిత సమస్య మాత్రమే కాదు; ఇది విద్యా సమానత్వానికి విరుద్ధమైన అంశం. ప్రభుత్వం దీనిని గమనించి ఉమెన్ సేఫ్టీ వింగ్స్‌, షీ టీమ్స్, 181 ఉమెన్ హెల్ప్‌లైన్ వంటి విభాగాల్లో కౌన్సిలర్ పోస్టులకు జెండర్ స్టడీస్ విద్యార్థులను కూడా అర్హులుగా గుర్తించాలి. పైగా వీరు ఫీల్డ్ ట్రైనింగ్ పొంది, అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం ఉన్నవారు. ఇటువంటి వ్యక్తులు బాధితురాళ్లతో మాట్లాడినప్పుడు వారు కేవలం సలహాదార్లుగా కాకుండా, ఒక మానవీయ ఆధారంగా నిలుస్తారు.

ఈ మార్పు కేవలం ఉద్యోగ అవకాశాల పరిమితిలోనే ఉండదు. జెండర్ స్టడీస్ విద్యార్థులు వ్యవస్థలో చేరడం ద్వారా పోలీస్ వ్యవస్థలో జెండర్ సెన్సిటివిటీ పెరుగుతుంది. మహిళా భద్రతా విధానాలు మరింత మానవీయంగా మారతాయి. చట్టపరమైన వ్యవహారాల్లో కూడా సానుభూతి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత ప్రపంచంలో మహిళా భద్రత అంటే కేవలం రక్షణ చర్యలు మాత్రమే కాదు; అది మానసిక, సామాజిక, భావోద్వేగ స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రక్రియ. ఈ ప్రక్రియలో జెండర్ స్టడీస్ విద్యార్థులు ముందుండాలి. వారు మహిళా హక్కుల ఉద్యమానికి శాస్త్రీయ దృష్టికోణం తీసుకురాగలరు. కాబట్టి, ప్రభుత్వం ఈ కోర్సు విద్యార్థులను కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ కౌన్సిలర్ పోస్టులకు అర్హులుగా గుర్తించి, ప్రత్యేక నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇది కేవలం విద్యార్థుల భవిష్యత్తు పరిరక్షణ మాత్రమే కాదు, మహిళా భద్రతా వ్యవస్థను మరింత సున్నితమైన, సమర్థవంతమైన, మానవీయ దిశగా నడిపించే ఒక ప్రగతిశీల అడుగు.

సోరుపాక అనిల్‌కుమార్

ఈ వార్తలు కూడా చదవండి:

Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు

PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు

Updated Date - Nov 06 , 2025 | 05:05 AM