Displacement of Adivasis: ఆదివాసీల హననాన్ని వ్యతిరేకిస్తూ సభ
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:13 AM
మధ్య భారతంలో నగ్జల్బరీ, తేబాగ, వాయిలార్ సాయుధ రైతాంగ పోరాటం, శ్రీకాకుళం, ఆదివాసులు గిరిజన సాయుధ..
మధ్య భారతంలో నగ్జల్బరీ, తేబాగ, వాయిలార్ సాయుధ రైతాంగ పోరాటం, శ్రీకాకుళం, ఆదివాసులు గిరిజన సాయుధ, ప్రతిఘటనా పోరాటాలు... పాలకులు ఆదివాసుల వైపు దృష్టి సారించడానికి, కొన్ని చర్యలు తీసుకోవడానికి దోహదం చేశాయి. కానీ కార్పొరేట్లకు ఖనిజ సంపదను అప్పజెప్పడం కోసం ప్రభుత్వాలు ఆదివాసీల హననాన్ని కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో పచ్చి హత్యాకాండను మోదీ–అమిత్‌షా నేతృత్వంలోని ప్రభుత్వం సాగిస్తోంది. సత్యశోధన చేయడానికి పౌరహక్కుల సంఘాలను కూడా అనుమతించకపోవడం ఆపరేషన్ కగార్ ప్రత్యేకత. ఓవైపు మావోయిస్టు పార్టీ శాంతి చర్చల కోసం ప్రకటన చేసినా, మేధావులు, ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం వారిని నిర్మూలిస్తామనే అంటోంది కానీ, ప్రజాస్వామికంగా వ్యవహరించడం లేదు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ప్రకటించాలని, ఎన్‌కౌంటర్ పేరుతో ఆదివాసీల, ఉద్యమకారుల జీవించే హక్కును రక్షించాలని, ఆపరేషన్ కగార్‌ను ఆపివేయాలని, పోలీసు క్యాంపులను వెంటనే ఎత్తివేయాలని, అటవీ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు బహిరంగ సభ జరుగనున్నది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరంగల్‌లోని అంబేడ్కర్ భవన్‌లో జరిగే ఈ సభలో ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్; జాన్ వెస్లీ, జె.వి.చలపతిరావు, పోటు రంగారావు, మల్లెపల్లి ప్రభాకర్, కె.విశ్వనాథ్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, గోడం గణేష్, సోనీ సోరీ, బేల బాటియా, అభినవ్ బూరం, రిటైర్డ్ ప్రొఫెసర్ కె.వెంకటనారాయణ, ఎన్.నారాయణరావు, రమణాల లక్ష్మయ్య, టి.రత్నకుమార్ ప్రసంగిస్తారు.
– ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక, తెలంగాణ