Share News

Tribute To Daasarathi: దాశరథీ కవిత పయోనిధీ

ABN , Publish Date - Jul 22 , 2025 | 03:01 AM

ఎత్తిన దీపమట్లు ప్రసరించెడి నీదగు పద్యకాంతిలో చిత్తములెల్ల గ్రోలె మధు శీధువులన్; కవితా ప్రసూనముల్

Tribute To Daasarathi: దాశరథీ కవిత పయోనిధీ
Tribute To Daasarathi

త్తిన దీపమట్లు ప్రసరించెడి నీదగు పద్యకాంతిలో

చిత్తములెల్ల గ్రోలె మధు శీధువులన్; కవితా ప్రసూనముల్

గుత్తులు గుత్తులై విరిసె! కోటపయిన్ ధ్వజమల్లలాడె!

వాగ్దత్తమె నీ కలమ్ము సుమి! దాశరథీ! కవితా పయోనిధీ!


మూల మెరుంగుచున్– తెలుగు భూమి పయిన్ వెదజల్లి నాడ

వాగాలిబు గీతముల్– రసజగంబది హారతులందజేసె

ఉర్దూలలితాంగి నీ కలముతో గరచాలనముం బొనర్చె

అందా లెదనార బోసితివి; దాశరథీ! కవితా పయోనిధీ!


సమర మొనర్చినాడవు నిజాము పయిన్ కవనంబుతోడ

ఖడ్గములు, తుపాకి గుండ్లు, విశిఖాలకు మించిన ఆయుధమ్ముగా

తిమిరము నూడ్చ గల్గినదదే కద! సైనిక పాత్ర నక్షరో

ద్యమమున నిల్చి దాల్చితివి దాశరథీ! కవితా పయోనిధీ!


మానితమై ప్రజాభ్యుదయ మానసమై భవదీయ లేఖినీ

గానము మేలుకొల్పె తెలగాణమునెల్ల; కవిత్వమెన్నడున్

గాని సమాజసేవ దిశగా బయనింపవలెన్; తెలుంగు

లాస్థానకవీ! నమస్సులివె! దాశరథీ! కవితా పయోనిధీ!


ఊరకనే వరింపదు మహోదయ వీధులలో కవిత్వమె

వ్వారిని గాని; నీకదె య వారిత లీల లభించెగా కవీశా!

రసశేఖరా! శతజయంతి రవీ! ఇవిగో నుతుల్ మహాత్మా!

రుచిరార్థ గేయనిధి! దాశరథీ! కవితా పయోనిధీ!

– రసరాజు (నేడు దాశరథి కృష్ణమాచార్య శతజయంతి)

Updated Date - Jul 22 , 2025 | 03:01 AM