Migrant Life Book Launch: వలస బతుకు ఆవిష్కరణ సభ
ABN , Publish Date - Nov 01 , 2025 | 06:42 AM
కుతుబ్‌షాహీల కాలంలో హైదరాబాద్ నిర్మాణానికి మొదలైన వలసలు ఈనాటికీ కొనసాగుతున్నాయి. రైలు మార్గాల నిర్మాణ కాలం నుంచి మన ప్రాంత వలస కూలీలు పాలమూరు లేబరుగా ప్రసిద్ధమయ్యారు.
కుతుబ్‌షాహీల కాలంలో హైదరాబాద్ నిర్మాణానికి మొదలైన వలసలు ఈనాటికీ కొనసాగుతున్నాయి. రైలు మార్గాల నిర్మాణ కాలం నుంచి మన ప్రాంత వలస కూలీలు పాలమూరు లేబరుగా ప్రసిద్ధమయ్యారు. లక్షలాది వలస కూలీలు తరతరాలుగా కష్టపడి దేశం నిర్మించారు. కానీ తమ జీవితాలను గౌరవప్రదమైన, సుఖవంతమైన జీవితాలుగా నిర్మించుకోలేకపోయారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలన చెలాయిస్తున్న పాలకులు, ప్రభుత్వాలు వచ్చిన తరువాత కూడా వలసలు ఆగలేదు. వలస జీవితాలు మారలేదు. ఈ జిల్లాలో లెక్కకు మిక్కిలిగా కవులు, రచయితలున్నా జిల్లా వలసల మీద ఒక్క నవలా రాలేదు. లక్షలాది కూలీలలో ఒక్కడు మరికల్ నర్సన్న తన వలస బతుకు రాశాడు. మిత్రుల కోరిక మేరకు తన వలస జీవితం ఏకబిగిన రాశాడు. తల్లిదండ్రులను, పిల్లలను, కుటుంబాన్ని ప్రేమించి రెక్కలు దాచుకోకుండా కష్టపడ్డాడు. ఏదీ దాచుకోకుండా రాశాడు. ఇప్పుడు ఆయన లేడు. ‘వలస బతుకు–నర్సన్న’ పుస్తకావిష్కరణ సభ రేపు ఉదయం 10 గంటలకు నారాయణపేట జిల్లా మరికల్‌లోని తిరుమల ఫంక్షన్ హాల్‌లో జరుగుతుంది. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ఆవిష్కర్త. పరకాల ప్రభాకర్, ప్రొ. జి. హరగోపాల్, గోరటి వెంకన్న, ఎం.రాఘవాచారి, డి.జి. హైమవతి, ఎండి ఇక్బాల్ పాష, ఎ. తిమ్మప్ప, ఎం. వెంకట్రాములు, ఎం. సుదర్శన్, ఎం. నారాయణ పాల్గొంటారు.
– పాలమూరు అధ్యయన వేదిక