Social Justice Development Debate: మహబూబ్‌నగర్ భవిష్యత్‌పై సదస్సు
ABN , Publish Date - Jul 05 , 2025 | 01:38 AM
తరాలు మారినాయి కానీ మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివాసుల, దళితుల, నిరుపేదల జీవన పరిస్థితులు మారలేదు. సహజవనరుల దోపిడీ తరలింపు ఆగలేదు.
తరాలు మారినాయి కానీ మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివాసుల, దళితుల, నిరుపేదల జీవన పరిస్థితులు మారలేదు. సహజవనరుల దోపిడీ తరలింపు ఆగలేదు. గుంపు వలసలు స్వతంత్ర వలసలైనాయి. 78 ఏండ్ల దేశ పాలన, 58 ఏండ్ల ఆంధ్రప్రదేశ్ పాలన, 11 ఏండ్ల తెలంగాణ పాలన మహబూబ్‌నగర్ జిల్లాను అభివృద్ధి పేరుతో వివక్షకు, పక్షపాతానికి గురిచేశాయి. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కాలుష్యకారక కంపెనీలు జిల్లా వనరులను దురాక్రమిస్తున్నాయి. ఈ పరిస్థితులను మార్చాలనే డిమాండ్‌తో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సదస్సు జరుగనున్నది. మూడు సెషన్లలో సాగే ఈ సభలో ప్రొ. జి. హరగోపాల్, రహమాన్, రాంచంద్రయ్య, డి. చంద్రశేఖర్, ప్రొ. డి.ఎన్, డా. బాబురావు, ప్రొ. కె. లక్ష్మీనారాయణ, కె. శ్రీనివాస్, ఎన్. వేణుగోపాల్, రాజేంద్రబాబు అర్విణి, ఎ. తిమ్మప్ప, ఎం. వెంకట్రాములు, కె. రవీంద్రనాథ్; ప్రొ. లక్ష్మణ్ గడ్డం, దొంతుల లక్ష్మీనారాయణ, బి. జ్యోతి, డా. జి. విజయ్, చంద్రశేఖర శర్మ, ఎం.డి. ఇక్బాల్ పాష, జి. వెంకటేశ్ గౌడ్, కె. వెంకటేశ్వర్లు; ఎం. కోదండరాం, కూనంనేని సాంబశివరావు, జాన్‌వెస్లీ, కె.జి. రాంచందర్, కె. గోవర్ధన్, ఎం. రాఘవాచారి పాల్గొంటారు.
– పాలమూరు అధ్యయన వేదిక