International Literacy Day: మరో గ్రంథాలయ ఉద్యమం
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:05 AM
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 8 సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సుందరయ్య పార్క్ నుండి..
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 8 సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సుందరయ్య పార్క్ నుండి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వరకు ‘వాక్ ఫర్ బుక్’ కార్యక్రమంలో భాగంగా పుస్తకం కోసం నడిచే కార్యక్రమం జరుగుతున్నది. తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వివరాలకు: 8801910908. మంచికంటి
ఆరుద్ర శతజయంతి
సాహిత్య అకాడమి – రైటర్స్ అకాడమి, విశాఖపట్నం సంయుక్త నిర్వహణలో ఆరుద్ర శతజయంతి కార్యక్రమం సెప్టెంబరు 13 ఉ.10గంటల నుంచి పౌరగ్రంథాలయం హాల్, ద్వారకానగర్, విశాఖపట్నంలో జరుగుతుంది. సభలో సి. మృణాళిని, మేడిపల్లి రవికుమార్, వివి రమణమూర్తి, మేడా మస్తాన్ రెడ్డి, చింతకింది శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటారు. ఎస్. రఘు, తలతోటి పృథ్వీరాజ్, అయ్యగారి సీతారత్నం తదితరులు పత్రసమర్పణ చేస్తారు. సాయంత్రం 4.30 నుంచి మొదలయ్యే ‘కవిసంధి’ కార్యక్రమంలో భాగంగా బులుసు వేంకటేశ్వర్లు తమ కవితలను చదువుతారు. సాహిత్య అకాడమి
సాహిత్య పురస్కారం
తాటికొండాల భ్రమరాంబ సాహిత్య పురస్కారాన్ని 2025 కు గాను ఏనుగు నరసింహారెడ్డి అందుకుంటారు. సెప్టెంబరు 13 సా.6గంటలకు ఖమ్మం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో పురస్కార ప్రధానం, ‘నెనరు–నెమరు’ కవిత్వ సంపుటి ఆవిష్కరణ ఉంటాయి. సభలో ప్రసేన్, సీతారాం, స్వర్ణ కిలారు, ఆనందాచారి, మువ్వా శ్రీనివాసరావు, రవి మారుత్, గుడిపాటి, గౌరీశంకర్, నీలిమ, వి.ఎస్. రావు తదితరులు పాల్గొంటారు. వంశీకృష్ణ
రెండుతరాల కవిసంగమం
రెండుతరాల కవిసంగమం (సీరీస్– 43)కార్యక్రమం సెప్టెంబర్ 13 సా.6 గంటలకు నిజాం కాలేజి, బషీర్ బాగ్, హైదరాబాద్‌లో జరుగుతుంది. కవులు హనీఫ్, ఎదిరెపల్లి కాశన్న, మాలతి పల్లా, సలీం, జుర్కి లావణ్య (నిజాంకాలేజి ఎం.ఏ విద్యార్థి). కవిసంగమం
సింగిల్ పేజీ కథల పోటీ
వంశీ ఆర్ట్ థియేటర్స్ సాహితీకిరణం మాసపత్రిక సౌజన్యంతో రామరాజు వేంకట సుబ్బారావు–లక్ష్మీనరసమ్మ స్మారక సింగిల్ పేజీ కథలపోటీ నిర్వహిస్తున్నది. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.॥5వేలు, ॥3వేలు, ॥2వేలు. రూ.1000 చొప్పున పది ప్రత్యేక బహుమతులు. సామాజిక అంశాలతో కథలను డి.టి.పి.లో ఒక పేజీ లోపు (ఫాంట్ 16, ఎ4 సైజులో) రాసి సెప్టెంబర్ 30 లోపు చిరునామా: ఎడిటర్, సాహితీకిరణం, 11–13–154, అలకాపురి, రోడ్ నెం.3, హైదరాబాద్ –500102 కు పంపాలి. వివరాలకు: 9490751681. పొత్తూరి సుబ్బారావు