సమాఖ్య స్ఫూర్తికి పట్టం కట్టిన తీర్పు
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:54 AM
తమిళనాడు గవర్నర్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల్ని చట్టవ్యతిరేకమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకం. ఆయన తొక్కిపెట్టిన పది బిల్లులను...

తమిళనాడు గవర్నర్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల్ని చట్టవ్యతిరేకమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకం. ఆయన తొక్కిపెట్టిన పది బిల్లులను ఆమోదించినట్టుగానే భావిస్తూ తీర్పునివ్వడం సరైన చర్య. ముందు ముందు అలా తొక్కిపెట్టే అవకాశాల్ని తగ్గిస్తూ గవర్నర్ విధులకు అవసరమైన పరిమితుల్ని విధించడం కూడా మంచిదే. గవర్నర్ స్థానానికి పెద్దరికం కట్టబెడుతూ, రాజ్యాంగం అస్పష్టంగా వదిలివేసిన లక్ష్మణ రేఖల్ని నేడు న్యాయస్థానం దిద్ది, బాగా కనబడేట్టు చేయాల్సి రావడం రాజకీయాల పుణ్యమే. కొంతమంది అత్యుత్సాహపు గవర్నర్లు పరిమితుల్ని దాటి కేంద్రం పట్ల విధేయతను చాటు కుంటారు. తమిళనాడు గవర్నర్ చేసింది ఇదే. సుప్రీం ఆ తప్పుని ఎత్తి చూపింది. ఇది రాజ్యాంగ వ్యవస్థల బాధ్యతల్ని గుర్తుచేసే మంచి తీర్పు.
డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ