Kodali Gopala Rao Centenary: కొడాలి గోపాలరావు శతజయంతి
ABN , Publish Date - Nov 03 , 2025 | 04:21 AM
సాహిత్య అకాడమీ, వివేక సర్వీస్ సొసైటీ సంయుక్త నిర్వహణలో కొడాలి గోపాలరావు శతజయంతి సదస్సు నవంబర్...
కొడాలి గోపాలరావు శతజయంతి
సాహిత్య అకాడమీ, వివేక సర్వీస్ సొసైటీ సంయుక్త నిర్వహణలో కొడాలి గోపాలరావు శతజయంతి సదస్సు నవంబర్ 9 ఉ.10గం.ల నుంచి వివేక సర్వీస్ సొసైటి ఆవరణ, బాపట్లలో జరుగుతుంది. స్వాగతోపన్యాసం సి. మృణాళిని, ప్రారంభోపన్యాసం వల్లూరు శివప్రసాద్, కీలకోపన్యాసం డి.యస్. యస్. మూర్తి, అధ్యక్షత అంబటి మురళీకృష్ణ.
ఖమ్మం ఈస్తటిక్స్ అవార్డు ఫలితాలు
ఖమ్మం ఈస్తటిక్స్ పోటీలో కవిత్వ విభాగంలో పలమనేరు బాలాజీ కవితా సంపుటి ‘లోపలేదో కదులుతున్నట్టు’ రూ.40 వేల బహుమతికి, రేణుక అయోల కవితా సంపుటి ‘రవిక’, పాయల మురళీకృష్ణ ‘గచ్చం చెట్టుకు అటూ ఇటూ’ ప్రత్యేక ప్రశంసకు ఎంపికయ్యాయి. కథల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను వరుసగా వి.ఆర్.రాసాని ‘తేనె కల్లు’ (రూ.25వేలు), ఆలూరి అరుణ్ కుమార్ ‘అంజమ్మ’ (రూ.15వేలు), యాములపల్లి నర్సిరెడ్డి ‘కావలి’ (రూ.10 వేలు) గెలుచుకున్నాయి. సాధారణ బహుమతికి ఎంపికైన మరో తొమ్మిది కథలతో ఒక కథా సంపుటి వస్తుంది. నవంబర్ 9 న ఖమ్మంలో జరిగే అవార్డుల ప్రదాన కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతితో పాటు షీల్డ్ అందిస్తారు.
పొత్తూరి సుబ్బారావు రాసిన సంపా దకీయాల సంపుటి ‘ప్రకాశ కిరణాలు’ ఆవిష్కరణ సభ నవంబర్ 6 సా.6 గం.లకు హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభ కళాసుబ్బారావు కళావేదికపై జరుగుతుంది. ఆవిష్కర్త: కె.వి. రమణాచారి, అధ్యక్షత: పి. విజయబాబు. కళా వి.ఎస్. జనార్దనమూర్తి, వంశీ రామరాజు, బైస దేవదాసు, మౌనశ్రీ మల్లిక్, పెద్దూరి వెంకటదాసు, పొత్తూరి జయలక్ష్మి పాల్గొంటారు.
-జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్
రెండుతరాల కవిసంగమం
రెండు తరాల కవిసంగమం సిరీస్– 45 నవంబర్ 8న సా.6గం.లకు నిజాం కాలేజి, బషీర్ బాగ్, హైదరాబాద్‌లో జరుగుతుంది. పాల్గొంటున్న కవులు: చెమన్, గట్టు రాధికమోహన్, తలారి సతీష్ కుమార్, జాదవ్ అంబదాస్, నితిన్ చౌహాన్ (నిజాం కాలేజి బి.ఏ విద్యార్థి). యాకూబ్