KANPS State Conference: కేఏఎన్‌పీఎస్ రెండవ రాష్ట్ర మహాసభ
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:46 AM
కులవ్యవస్థ నిర్మూలన కోసం కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి KANPS 1992 నవంబర్ 22న అఖిలభారత స్థాయిలో ఏర్పడింది.
కులవ్యవస్థ నిర్మూలన కోసం ‘కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి’ (KANPS) 1992 నవంబర్ 22న అఖిలభారత స్థాయిలో ఏర్పడింది. అనివార్య కారణాల వల్ల ఆచరణలోకి అడుగుపెట్టలేదు. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఉప్పుమావూలూరి సాంబశివరావు చొరవతో 2019 సెప్టెంబర్ 17న పెరియార్ 140వ జయంతి, శరద్ పాటిల్ (వ్యవస్థాపకులు–మహారాష్ట్ర) 94వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కార్యాచరణలోకి అడుగుపెట్టింది. విద్య, ఉద్యోగ రంగాలలో అగ్రకుల ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి తీసుకువచ్చిన ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గళమెత్తింది. కుల అసమానతలు రూపుమాపడానికి జనగణనలో కులగణన చేపట్టాలని నినదించింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టబద్ధత కోసం అట్టడుగు ఎస్సీ ఉపకులాల వైపు నిలబడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలు, రైతులు, రైతు కూలీలు తమ జీవనోపాధి అయిన వ్యవసాయాన్ని విధ్వంసం చేస్తూ కాలుష్యాన్ని వెదజల్లి, పర్యావరణాన్ని దెబ్బతీసే చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించింది. 2022 నవంబర్ 22న హైదరాబాదులో తన మొదటి రాష్ట్ర మహాసభలను విజయవంతంగా పూర్తిచేసుకున్నది. ప్రస్తుతం ఆరేళ్ల కార్యాచరణతో 2వ రాష్ట్ర మహాసభలను 2025 జూలై 13న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ హాల్, తెలంగాణ చౌరస్తా, మహబూబ్‌నగర్ పట్టణంలో జరపనున్నది. ఉదయం పది గంటల నుంచి నాలుగు సెషన్లలో ఈ సభ జరగనున్నది. పలువురు వక్తలు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు.
– బండారి లక్ష్మయ్య,
కేఏఎన్‌పీఎస్ ఆలిండియా కన్వీనర్