Share News

‘జ్వాలాశిఖ విశ్వమోహన్‌’ పుస్తకావిష్కరణ సభ

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:53 AM

సుమారు 20 నవలలు రాసి, ఒక రచయితనని ప్రచారం చేసుకోవటం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేని వ్యక్తి కొమ్మిరెడ్డి విశ్వమోహనరెడ్డి. ఆయనకు బడుగు జీవులతో కలిసిమెలిసి జీవించడమే...

‘జ్వాలాశిఖ విశ్వమోహన్‌’ పుస్తకావిష్కరణ సభ

సుమారు 20 నవలలు రాసి, ఒక రచయితనని ప్రచారం చేసుకోవటం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేని వ్యక్తి కొమ్మిరెడ్డి విశ్వమోహనరెడ్డి. ఆయనకు బడుగు జీవులతో కలిసిమెలిసి జీవించడమే ప్రాణ సమాన కార్యకలాపం. అలాంటి వ్యక్తి ప్రజా ఉద్యమకారుడు కూడా అయితే! అందుకు అతను పొందిన పురస్కారం ఎన్‌కౌంటర్‌ హత్య! విశ్వమోహనరెడ్డి తన తొలి రచనాకాలంలో పుంఖాను పుంఖాలుగా డిటెక్టివ్‌ నవలలు రాశారు. వాస్తవ రహిత, ఆధార రహిత అభూతకల్పనలు రాయబోనని చెప్పిన ఆయన, చివరికంటా అందుకు కట్టుబడి నిలబడ్డాడు. ఆయన మానవహోమం నవల ‘భోగిమంటలు’ సినిమాగా విడుదలైంది. అతివాద రాజకీయాలను వదిలి ప్రజా ఉద్యమ కార్యకలాపాలలోకి నడిచి పిడుగురాళ్ళలో సున్నపురాయి కార్మికులను సంఘటితపరిచాడు. రైతుకూలీ సంఘాలు నిర్మించాడు. రాజుపాలెం నుంచి త్రిపురాంతకం దాకా రైతు కూలీలను ఉద్యమంగా ఉవ్వెత్తున కదిలించాడు. ఉద్యమకారుడుగా ప్రజల హృదయాలలోను, సాహిత్యకారునిగా పాఠకుల మనసులలోనూ జీవిస్తున్న విశ్వమోహన్‌ రెడ్డిని, ఆయన వ్యక్తిత్వాన్ని, సాహిత్యోద్యమ కృషిని తలచుకుంటూ ‘జ్వాలాశిఖ విశ్వమోహన్‌’ పుస్తకావిష్కరణ సభ జరుగనున్నది. ఏప్రిల్‌ 11న సాయంత్రం ఐదు గంటలకు గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌, 5వ లైనులోని సీనియర్‌ సిటిజన్స్‌ సేవాకేంద్రంలో జరిగే ఈ సభలో బి.అరుణ, డా. బీరం సుందరరావు, వల్లూరు శివప్రసాద్‌, నల్లూరి రుక్మిణి, టి. శ్రీదేవి, దివికుమార్‌ పాల్గొంటారు.

– జనసాహితి

Updated Date - Apr 10 , 2025 | 03:53 AM