స్థానిక భాషల్లో ఇంటర్న్‌షిప్
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:59 AM
తెలంగాణలోని స్థానిక భాషలను డిజిటల్ ప్రపంచంలో నిలిపేలా ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని ఇండిక్ వికీ ప్రాజెక్ట్ (ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్) అందిస్తోంది. ఈ కార్యక్రమం ప్రధానంగా...

తెలంగాణలోని స్థానిక భాషలను డిజిటల్ ప్రపంచంలో నిలిపేలా ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని ఇండిక్ వికీ ప్రాజెక్ట్ (ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్) అందిస్తోంది. ఈ కార్యక్రమం ప్రధానంగా వనరులు తక్కువగా ఉన్న తెగల భాషల డిజిటల్ పరిరక్షణ, అభివృద్ధి, వికీపీడియా వంటి వేదికలపై కంటెంట్ సృష్టింపు మీద దృష్టి సారిస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొన్నవారు గొండి, కోయ, కోలామి, నాయక్, చెంచు, కైకాడి (యెరుకల), లంబాడి, నక్కల, కొండ కమ్మర వంటి భాషలకు సంబంధించిన డిజిటల్ కంటెంట్‌ను రూపొందిస్తారు. ప్రస్తుత అండర్ గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు లేదా ఇటీవలి గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేయవచ్చు. పై దేశీయ భాషలలో కనీసం ఒక దానిలో అనర్గళంగా మాట్లాడటం, రాయడం (తెలుగు లిపిలో) తప్పనిసరి. మే 12 నుంచి జూన్ 30, 2025 వరకు జరిగే ఈ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులను ఏప్రిల్ 30 లోగా https://indicwiki.iiit.ac. in/internship2025కు పంపాలి. మరిన్ని వివరాలకు: pm.indicwiki@iiit.ac.in.
డా. రాధిక మామిడి,
ఇండిక్ వికీ ప్రాజెక్ట్
For AndhraPradesh News And Telugu News