Demand for Dignified Living: కార్మిక పింఛన్‌ను పెంచాలి
ABN , Publish Date - Nov 05 , 2025 | 01:30 AM
పింఛను పెంపు కోసం ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రూ.1000గా ఉన్న ఈపీఎఫ్‌ఓ కార్మిక నెలవారీ పింఛన్‌ను కేంద్రం త్వరలో...
కార్మిక పింఛన్‌ను పెంచాలి
పింఛను పెంపు కోసం ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రూ.1000గా ఉన్న ఈపీఎఫ్‌ఓ కార్మిక నెలవారీ పింఛన్‌ను కేంద్రం త్వరలో రూ.2,500కు పెంచనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిని కనీసం రూ.7500కు పెంచాలని కొంత కాలంగా కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నానాటికీ పెరిగిపోతున్న ధరల నేపథ్యంలో కుటుంబంతో తామెలా బతకాలి అని పింఛన్‌దారులు ఆవేదన చెందుతున్నారు. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛన్‌ను చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పెంచింది. కార్మిక పింఛన్‌ను పెంచడంపై కేంద్రానికి కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలి. కార్మిక భవిష్య నిధి(ఈపీఎఫ్)లో రూ. లక్షల కోట్ల కార్మిక సొమ్ము ఉన్నది. అయినప్పటికీ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదారం చూపకపోవడం విచారకరం. తనకు పేదలంటే ఎంతో గౌరవమని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఎన్నోసార్లు చెప్పారు. కానీ దాన్ని చేతలలో చూపించడంలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నెలవారీ పింఛన్‌ను రూ.7500కు పెంచాలి.
ముద్దంశెట్టి రమణమూర్త