Share News

Smart Governance: హౌస్ ఓనర్‌షిప్ స్మార్ట్‌కార్డు అవసరం

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:45 AM

పంచాయతీల్లో సాధారణంగా ఇంటి నెంబర్‌తోనే యజమానులు ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను చెల్లిస్తుంటారు.

Smart Governance: హౌస్ ఓనర్‌షిప్ స్మార్ట్‌కార్డు అవసరం

పంచాయతీల్లో సాధారణంగా ఇంటి నెంబర్‌తోనే యజమానులు ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను చెల్లిస్తుంటారు. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో కాస్త భిన్నంగా PTIN (Property Tax Identification Number)తో ఆస్తిపన్ను చెల్లిస్తారు. ఈ విధానం మారాల్సిన అవసరముంది. ఇల్లు, ఇంటి యజమానికి సంబంధించిన పూర్తి వివరాలతో ‘హౌస్ ఓనర్‌షిప్ స్మార్ట్‌కార్డు’ను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇది బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. లావాదేవీలు జరిగిన ప్రతిసారీ సంబంధిత పత్రాలను సమర్పించనవసరం లేకుండా ఆ కార్డును గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానించాలి. ఇల్లు, భూ క్రయవిక్రయాలు జరిగినప్పుడు, యాజమాన్యపు హక్కులను బదిలీ చేసినప్పుడు ఎలాంటి అవరోధాలు లేకుండా లావాదేవీలు జరుపుకోవడానికి వీలుగా ఈ కార్డును ప్రవేశపెట్టాలి. మన నిత్య జీవితంలో ఆధార్‌, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్‌... లాగా కొత్తగా హౌస్ ఓనర్‌షిప్ స్మార్ట్‌కార్డులను రూపొందించాలి.

– దండంరాజు రాంచందర్‌రావు

Updated Date - Jul 05 , 2025 | 01:45 AM