Share News

చెక్కిళ్ళపై చెమ్మని తుడిచిన జీవో 6

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:49 AM

ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. దాన్నే ప్రజాప్రభుత్వం అంటారు. నీళ్ళూ నిధులే కాదు. విద్య, ఆరోగ్యం, నియామకాలు కూడా ముఖ్యమే. ప్రత్యక్ష నియామకాలు ఎంత అవసరమో...

చెక్కిళ్ళపై చెమ్మని తుడిచిన జీవో 6

ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. దాన్నే ప్రజాప్రభుత్వం అంటారు. నీళ్ళూ నిధులే కాదు. విద్య, ఆరోగ్యం, నియామకాలు కూడా ముఖ్యమే. ప్రత్యక్ష నియామకాలు ఎంత అవసరమో కారుణ్య నియామకాలూ అంతే అవసరం. ఒక ఉద్యోగి మరణిస్తే ప్రభుత్వం ఆ కుటుంబానికి చేయూతనందించాలి. 2013లో పంచాయత్‌రాజ్‌ శాఖలో పనిచేసే వారికి జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఉద్యోగాలను ఇచ్చే అధికారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పరిధిలోకి తెచ్చారు. 2015 నుండి కారుణ్య నియామకాల ఫైలు పెండింగ్‌లో పడిపోయింది. పదవీ విరమణ వయస్సు పెంచడం, వీఆర్వోలను సంస్కరణల పేరుతో వేరే శాఖలకి పంపించడం కారణాలుగా చూపి కారుణ్య నియామకాలను అమలుపరచలేదు. గత ప్రభుత్వం ఈ విషయంలో దయ లేకుండా ప్రవర్తించింది. ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో చాలామంది కారుణ్య నియామకాలను కూడా చేపట్టాలని కోరుకున్నారు. రాష్ట్రం సిద్ధించి పదేళ్ళయినా వారి కోర్కె తీరలేదు. భర్తలు పోయిన భార్యలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ వర్ణనాతీతం.


G.O.No.79 ద్వారా ఒక మూడు జిల్లాల్లో కొన్ని నియామకాలు జరిగాయి. కాని సుమారు 600 మంది సుదీర్ఘ నిరీక్షణలో ఉండిపోయారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ తన తప్పులకు తానే బలయ్యింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సామాన్యుల సమస్యలను అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య పదిరెట్లు పెరిగింది. పౌరసమాజం స్వరాల్ని వినేవాళ్ళు పెరిగారు. కొంతమంది ఆలోచనాపరులు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు విడమరిచి చెప్పారు. అధికారులలో కొందరు మానవతా దృష్టితో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయారు. వారి సమస్యను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చజెండా ఊపారు. ప్రభుత్వానికి కారుణ్య నియామకాల సమస్యని తీసుకెళ్ళిన అధికారులలో పోలీసుశాఖ అధికారులు కూడా ఉన్నారు. G.O.Ms.No.6 ద్వారా 582 మంది పెండింగ్‌ దరఖాస్తుదారులకు నియామకాలు దక్కాయి. దశాబ్దాలపాటుగా పెండింగ్‌లో ఉన్న వారి కళ్ళల్లో, జీవితాల్లో వెలుగులు విరజిమ్మాయి. నేడు రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలను అందుకోబోతున్నవారికి అభినందనలు.

జి. తిరుమలకుమార్‌

ఇవి కూడా చదవండి:

BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Updated Date - Mar 19 , 2025 | 01:14 AM