Positive Mindset: జీవితం అన్నాక
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:20 AM
జీవితాన్ని కాస్త చల్లని గాలికి ఆరేసుకోవాలి నాలుగు ముచ్చట్లు నలుగురితో పంచుకోవాలి మన గుమ్మిలోని గింజలను నలుగురితో కలిసి ఆరగించాలి....
జీవితాన్ని కాస్త
చల్లని గాలికి ఆరేసుకోవాలి
నాలుగు ముచ్చట్లు నలుగురితో
పంచుకోవాలి
మన గుమ్మిలోని గింజలను
నలుగురితో కలిసి ఆరగించాలి
రేపటి పేజీ కనిపిస్తుందో లేదో
ఇప్పుడే రంగులు అద్దుకోవాలి
మనుషులలో మొలుస్తున్న
ముళ్ళను పీకవతల పారేయాలి
మట్టి పరిమళాలు పూయాలి
అవి ఊరు ఊరంతా వీస్తాయి హాయిగా
రోజన్నాక రాత్రి పగలు ఉన్నట్లు
జీవితం అన్నాక మంచి చెడులు ఉంటాయి
దేనికి వణుకు బెణుకు లేకుండా
వెళ్లడమే నేర్చుకోవాలి
-గుండెల్లి ఇస్తారి & 98499 83874