Share News

D Day

ABN , Publish Date - Mar 17 , 2025 | 12:12 AM

ఉన్నట్టుండి జైలు వాతావరణం గంభీరమైపోతుంది పిట్ట కదలదు కొమ్మ ఊగదు రహస్య సంకేతమేదో ఖైదీల్లో గుబులు రేపుతది...

D Day

ఉన్నట్టుండి

జైలు వాతావరణం

గంభీరమైపోతుంది

పిట్ట కదలదు

కొమ్మ ఊగదు

రహస్య సంకేతమేదో

ఖైదీల్లో గుబులు రేపుతది

ఫాన్సీ రూమ్

మరింత గడ్డకట్టుకుపోతుంది

అక్కడ ప్రతి మట్టి రేణువు

ఓ కథ చెబుతుంది

ముందుగానే

ఖైదీని వీలునామా అడుగుతారు

పేదోడికి వీలునామా ఏముంటది

బతకాలన్న ఆకాంక్ష తప్ప

అదెప్పుడూ గుంజేసుకుంటారాయే

ఆరోజు

ఖైదీ మనసు చదవడం చాలా కష్టం

అంతకన్నా

ఒంటిచేత్తో సముద్రం ఈదడం సులభమేమో.

అన్నీ సరిచూసుకుంటారు

మెడకొలత, ఉరికొలత.. వగైరాలు

మెడ విరగకపోతే

ఊపిరి కోసం తండ్లాట

ఊహకందని విషయం

ఉరితాడుకు

పెరుగును, కొవ్వొత్తిని రాస్తారు

సుఖమరణ ప్రాప్తి జరగాలి కదా..

ఖైదీ ముఖానికి

నల్లని ముసుగేస్తారు

బాధ ప్రపంచానికి

తెలువొద్దనుకుంటారు గాని

తల్లిపేగు ఎక్కడో కదిలే ఉంటది

గాలి స్తంభించిపోతుంది

వన్.. టూ.. త్రీ

ఎర్రటి దస్తీ కింద పడిపోతుంది

క్రేక్ మనే లెవర్ చప్పుడుతో

ఖైదీ శబ్ద ప్రపంచం ఆగిపోతుంది

తాడు కొసన

ఒక జీవితం వేలాడుతుంది

బయట సముద్రం ఉండజుట్టుకొని

మూర్ఛపోతుంది

ఉదయమిత్ర

ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: దొంగలు, దోపిడీదారులను బట్టలిప్పి నిలబెడతా: సీఎం రేవంత్ రెడ్డి..

DK Aruna: ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు..

Updated Date - Mar 17 , 2025 | 12:13 AM