Women Empowerment: 30 వసంతాల చైతన్య మహిళా సంఘం
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:33 AM
1991 మద్యనిషేధ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న కాలంలో పాల్గొన్న భావసారూప్యత గల సంఘాలు ఏకమై, 1995 సెప్టెంబర్ 24, 25న ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా...
1991 మద్యనిషేధ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న కాలంలో పాల్గొన్న భావసారూప్యత గల సంఘాలు ఏకమై, 1995 సెప్టెంబర్ 24, 25న ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సమాఖ్యగా ఏర్పడి తదనంతరం చైతన్య మహిళా సంఘంగా మారింది. సంపూర్ణ మద్యనిషేధం, సంక్షేమ పథకాల అమలుకై పోరాటాలు చేసింది. ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు చేసింది. మహిళా చట్టాలలో మార్పుల కోసం పోరాడింది. మహిళలపై హింసకు కారణమైన సంస్కృతికి వ్యతిరేకంగా అవగాహన తరగతులు, సమావేశాలు నిర్వహిస్తూ, మహిళామార్గం పత్రిక ద్వారా చైతన్యం పెంచుతోంది. కష్టాలకు కారణమైన వాటిని తెలుసుకుని ఉద్యమిస్తే సమాజం అభివృద్ధి వైపు పయనిస్తుంది. ఈ నేపథ్యంలో చైతన్య మహిళా సంఘం ఆవిర్భావదినం సందర్భంగా కడప జిల్లా, రామేశ్వరం రోడ్డులోని తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో నేడు సదస్సు జరగనున్నది. మూడు సెషన్లలో జరిగే ఈ సభలో ప్రసంగాలు, పుస్తకావిష్కరణలు, సందేశాలు ఉంటాయి.
– జ్యోతి, రాష్ట్ర కన్వీనర్, చైతన్య మహిళా సంఘం