Share News

The Fire Within: మంట

ABN , Publish Date - Nov 10 , 2025 | 05:55 AM

నీటిలో దాక్కుంటావు సరే నిప్పులో ఎట్లా దాక్కుంటావు? మేఘవిస్ఫోటనం నుండి తప్పించుకుంటావు సరే...

The Fire Within: మంట

నీటిలో దాక్కుంటావు సరే

నిప్పులో ఎట్లా దాక్కుంటావు?

మేఘవిస్ఫోటనం నుండి

తప్పించుకుంటావు సరే

ఆకాశం గురి చూసి కొడుతున్న

పిడుగులను ఎట్లా తప్పించుకుంటావు?

పర్వతాల నుండి వరదై ప్రవహిస్తున్న

ఘోర హిమపాతం సరే

అగ్నిపర్వతాల్ని బద్దలుకొట్టుకుని వచ్చే

లావా ప్రవాహం సంగతేమిటి?

కార్చిచ్చుకు బలవుతున్న ప్రతి చెట్టు

ఒక ఆగ్నేయాస్త్రమే

యుద్ధం కూడా ఫైర్‌తో మొదలై

ఫైర్‌తో అంతమవుతుంది

కాని అన్ని అగ్నుల కన్నా క్రూరమైంది

అన్ని చిచ్చుల కన్నా భయంకరమైంది

అన్ని మంటల కన్నా ప్రాణాంతకమైంది

ఒకటుంది

క్షణక్షణం మృత్యువుకు చేరువ చేసే

కాలకూటం

కడుపులో విస్తరించే ఎడారి

మనిషిని జంతువు చేసే ఘోర కరువు

అదే

ఆకలిమంట!

అమ్మంగి వేణుగోపాల్‌

94410 54637

Updated Date - Nov 10 , 2025 | 05:55 AM