The Forest Surrenders: అయిపోయింది
ABN , Publish Date - Oct 17 , 2025 | 01:42 AM
అయిపోయింది మిత్రమా అడవిని కడిగి కళ్ళాపు జల్లేశారు...
అయిపోయింది మిత్రమా అడవిని కడిగి కళ్ళాపు జల్లేశారు...
రండి రండి ముగ్గేసి పెగ్గేసుకుందాం...
ఎన్ని యుద్ధాలు ఎన్ని త్యాగాలు ఎన్ని ఆశలు, ఎన్ని ఆశయాలు
ఎన్ని వ్యూహాలు, ఎన్ని ఆత్మార్పణలు ఎంత యువత ఎన్ని వెలిగి మలిగిన దీపాలు...
చిందు వేయటానికి చీకటి బాగుందనుకునే వారికి వెన్నెల ఎందుకు? వేకువ ఎందుకు?
చివరికి ఆయుధానికి అడవి సాగిలపడింది
వెక్కిరిస్తున్న కాగితపు ముల్లెల ముందు పట్టపగలు ఆలోచన ఆత్మహత్య చేసుకుంది
– శైలకుమార్