Today Horoscope: ఈ రాశి వారు.. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి
ABN , Publish Date - Oct 25 , 2025 | 04:29 AM
నేడు రాశిఫలాలు 25-10-2025 - శనివారం, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన చర్చలు ప్రయాణాలకు అనుకూలమైన రోజు..

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన చర్చలు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఉన్నత విద్య కోసం నిధులు సర్దుబాటు అవుతాయి. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. సమావేశాల్లో ఖర్చులు అధికం. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, స్పెక్యులేషన్లలో మంచి లాభాలు ఆర్జిస్తారు. రుణాలు మంజూరవుతాయి. ఫైనాన్స్, చిట్‌ఫండ్లు, వడ్డీ వ్యాపారులకు ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

మిథునం ( మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారి సహకారంతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు విందు వినోదాలు ఆనంద కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికం. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఫార్మా, ఆహారదార్థాలు, డెయిరీ, కిరాణా వ్యాపారులలు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఇంటికోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. టెలివిజన్, ఆడిటింగ్, టీచింగ్ రంగాల వారు మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. విష్ణుమూర్తిని ఆరాధించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
రిజిస్ట్రేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు. స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు అందుకుంటారు. ఇల్లు, స్థలసేకరణకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. బదిలీలు, మార్పుల కోసం చసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఫీజులు, బిల్లులు చెల్లించేందుకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వ్యాపారం, ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
కొంతకాలంగా ఉన్న నిరుత్సాహ వాతావరణం తొలగిపోయి, మనసు ఉల్లాసంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. ఉన్నత చదువులు, విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక రహస్యం తెలుసుకుంటారు. ప్రచురణలు, కళలు, ఎగుమతులు, టెక్స్‌టైల్స్, ఫొటోగ్రఫీ ర ంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమావేశాలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
పెద్దలతో సమావేశాలు, ఆర్థికపరమైన నిర్ణయాలకు అనుకూలమైన రోజు. ఉద్యోగులు, వ్యాపార రంగంలోని వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకల్ప సాధనకు ఆటంకాలు ఎదురవుతాయి. లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించండి.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ వ్యాపారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. టెలివిజన్, పత్రికలు, విద్య, రక్షణ రంగాల వారికి పదోన్నతులు లభిస్తాయి. సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. పెద్దలు, పైఅధికారుల సహకారం లోపించడంతో లక్ష్య సాధన కష్టంగా మారుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ