Share News

Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది

ABN , Publish Date - Oct 17 , 2025 | 04:34 AM

నేడు రాశిఫలాలు 17-10- 2025 - శుక్రవారం , వేడుకలు ఆనందం కలిగిస్తాయి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు...

Today Horoscope: ఈ రాశి వారికి  ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది

నేడు రాశిఫలాలు 17-10- 2025 - శుక్రవారం , వేడుకలు ఆనందం కలిగిస్తాయి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వేడుకలు ఆనందం కలిగిస్తాయి. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు లభిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు.


MESHAM-02.jpg

వృషభం (ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

బదిలీల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇల్లు, స్థలం మార్పు వ్యవహారాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితుల వైఖరిలో సానుకూలమైన మార్పు గమనిస్తారు. శ్రీ లలితాదేవి ఆరాధన శుభప్రదం.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతములకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు లభిస్తాయి. కమ్యూనికేషన్లు, రవాణా, టీచింగ్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.


MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. స్థిరాస్తి పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకునేందుకు అనుకూలమైన రోజు. ఫర్నీచర్‌, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఆర్థిక పరస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దుర్గామాతను ఆరాధించండి.


MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఈ రోజు ఒక శుభవార్త అందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. తోబుట్టువుల వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కిరాణా వ్యాపారులు, మార్కెటింగ్‌, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గాయత్రీ మాత ఆరాధన శుభప్రదం.


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ఎగుమతులు, విదేశీ వ్యాపారులకు ఆర్థికంగా లాభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక రహస్య సమాచారం తెలుసుకుంటారు. విలువైన వస్తువులు బహుమతులుగా అందుకుంటారు.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సమావేశాల్లో మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. ఆర్థికపరమైన నిర్ణయాలకు అనుకూలమై రోజు. పదిమందిని కలుపుకుని మంచి కార్యక్రమాలను చేపడతారు. వాణిజ్యరంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరమేశ్వరిని ఆరాధించడి.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, సినీ రంగాలకు చెందిన వారికి పెద్దలు, ప్రముఖుల సహకారం లభిస్తుంది. విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి ప్రతిఫలాలు లభిస్తాయి. దూరప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలను సమీక్షించుకుంటారు.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఉన్నత విద్య, దూరప్రయాణాలు, కొత్త వ్యూహాల అమలు అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. సమావేశాల కోసం ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కనకధారా సోత్త్ర పారాయణ శుభప్రదం.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగంలో అదనపు ఆదాయం అందుకుంటారు. పన్నులు, బీమా, మెడికల్‌ క్లెయిములు, రుణాలు, అడ్వాన్సుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. సంస్మరణల్లో పాల్గొంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, బృందకార్యక్రమాలు, వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి వ్యూహాన్ని అనుసరించడం ద్వారా చక్కటి ప్రతిఫలాలు అందుకుంటారు.


MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికపరమైన ప్రతిఫలాలు అందుకుంటారు. సహోద్యోగుల వ్యక్తిగత విషయాలు చర్చకు వస్తాయి. విందు వినోదాలు కోసం ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులు బోనస్‌లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Oct 17 , 2025 | 04:34 AM