Share News

Truck Driver Jailed 10 Years: ట్రక్ నడుపుతూ అశ్లీల వీడియో చూశాడు.. కట్ చేస్తే..

ABN , Publish Date - Sep 21 , 2025 | 12:17 PM

ఇదే సమయంలో డానీ ఏట్చిన్‌సన్ అనే వ్యక్తి హైవేపై కారులో వెళుతూ ఉన్నాడు. ఏట్చిన్‌సన్ భార్యతో ఫోన్ మాట్లాడటంలో బిజీ అయిపోయాడు. అతడు కూడా రోడ్డుపై ఏం జరుగుతోందో పట్టించుకోవటం మానేశాడు.

Truck Driver Jailed 10 Years: ట్రక్ నడుపుతూ అశ్లీల వీడియో చూశాడు.. కట్ చేస్తే..
Truck Driver Jailed 10 Years

అశ్లీల వీడియోలకు బానిస అవ్వటం అంటే జీవితాన్ని చేతులారా నాశనం చేసుకోవటమే. డ్రగ్స్ అడిక్షన్ కంటే అశ్లీల వీడియోలు చూడ్డానికి బానిస అవ్వటం అన్నది చాలా ప్రమాదకరమైంది. మన జీవితాలతో పాటు మనతో పాటు ఉన్న వారి జీవితాలను కూడా ఇది నాశనం చేస్తుంది. ఇందుకు ఇప్పుడు చెప్పబోయే ట్రక్ డ్రైవర్ జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. ఓ ట్రక్ డ్రైవర్ అశ్లీల వీడియోలకు బానిస అయ్యాడు. ట్రక్ నడుపుతూ కూడా వీడియోలు చూడసాగాడు. దీంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ నిండు ప్రాణం బలైంది.


పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. యూకేకు చెందిన నెయిల్ ప్లాట్ అనే 43 ఏళ్ల వ్యక్తి ట్రక్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. 2024, మే 17వ తేదీన అతడు స్కెల్‌మెర్సెడేల్‌లోని హైవేపై ట్రక్ నడుపుతూ ఉన్నాడు. డ్రైవింగ్ చేస్తున్నాడన్న మాటే కానీ, అతడి దృష్టి మొత్తం ఫోన్ మీదే ఉంది. అతడు తన ఫోన్‌లో పాడు వీడియోలు చూడటంలో బిజీ అయిపోయాడు. ముందు రోడ్డు మీద ఏం జరుగుతుందో కూడా గుర్తించలేని స్థితిలోకి వెళ్లిపోయాడు.


ఇదే సమయంలో డానీ ఏట్చిన్‌సన్ అనే వ్యక్తి హైవేపై కారులో వెళుతూ ఉన్నాడు. ఏట్చిన్‌సన్ భార్యతో ఫోన్ మాట్లాడటంలో బిజీ అయిపోయాడు. అతడు కూడా రోడ్డుపై ఏం జరుగుతోందో పట్టించుకోవటం మానేశాడు. దీంతో ట్రక్ వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఏట్చిన్‌సన్ అక్కడికక్కడే చనిపోయాడు. 2025 సెప్టెంబర్ 19వ తేదీన ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత నెయిల్ ప్లాట్‌ను కోర్టు దోషిగా తేల్చింది. అతడికి పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది.


ఇవి కూడా చదవండి

కేఏ పాల్‌పై లైంగిక ఆరోపణలు.. పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు..

రజినీకి గుడి కట్టి నవరాత్రి పూజలు చేస్తున్న అభిమాని..

Updated Date - Sep 21 , 2025 | 12:24 PM