Share News

Woman Distress Message: తల్లికి చివరి మెసేజ్.. అమ్మా నన్ను వీళ్లే చంపేస్తారు..

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:09 PM

Woman Distress Message: పెళ్లయిన కొంతకాలం పాటు వీరికాపురం సజావుగానే సాగింది. తర్వాతినుంచి గొడవలు మొదలయ్యాయి. నౌఫాల్ భార్యను వేధిస్తూ ఉండేవాడు. కొడుకు పుట్టిన తర్వాత ఆ వేధింపులు మరింత పెరిగాయి.

Woman Distress Message: తల్లికి చివరి మెసేజ్.. అమ్మా నన్ను వీళ్లే చంపేస్తారు..
Woman Distress Message

తరతరాలుగా, యుగయుగాలుగా ఆడవారికి అత్తింట్లో వేధింపులు తప్పటం లేదు. అన్ని రంగాల్లో రానిస్తున్న ఆడవాళ్లను మెట్టినింటి వాళ్లు రాచి రంపాన పెడుతున్నారు. అదనపు కట్నం కోసమో.. మగ పిల్లాడిని కనటం లేదనో.. ఇలా ఏదో ఒక విషయంలో ఆడవాళ్లు అత్తింట్లో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా, అత్తింటి వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తల్లికి చివరి మెసేజ్ పెట్టి ప్రాణం తీసుకుంది. ఈ సంఘటన కేరళలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు..


త్రిస్సూర్ జిల్లాకు చెందిన నౌఫాల్, ఫసీలా భార్యాభర్తలు. పెళ్లయిన కొంతకాలం పాటు వీరికాపురం సజావుగానే సాగింది. తర్వాతినుంచి గొడవలు మొదలయ్యాయి. నౌఫాల్ భార్యను వేధిస్తూ ఉండేవాడు. కొడుకు పుట్టిన తర్వాత ఆ వేధింపులు మరింత పెరిగాయి. వేధింపులు భరించలేకపోయిన ఫసీలా చనిపోవాలనుకుంది. చనిపోయే ముందు తన తల్లికి ఓ వాట్సాప్ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్‌లో.. ‘అమ్మా.. నేను చావబోతున్నాను. లేకపోతే వాళ్లే నన్ను చంపుతారు. నేను రెండో సారి గర్భం దాల్చాను. అయినా నాకు వేధింపులు తప్పటం లేదు. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నా భర్త నన్ను కడుపుపై కొడుతున్నాడు

kerala.jpg


నా చెయ్యి కూడా విరగ్గొట్టారు. మా అత్త ఎప్పుడూ నన్ను బూతులు తిడుతూ ఉంటుంది ’ అని రాసుకొచ్చింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఫసీలా అత్తింటి వారికి విషయం చెప్పారు. హుటాహుటిన ఫసీలా దగ్గరకు బయలుదేరారు. అయితే, అప్పటికే పరిస్థితి చెయ్యిదాటి పోయింది. ఫసీలా అత్తింట్లో విగతజీవిగా దర్శనం ఇచ్చింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త నౌఫాల్, అత్త రామ్లాను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వారిని కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.


ఇవి కూడా చదవండి

ఏడేళ్లలో 42 సార్లు రిజెక్ట్ చేసింది.. 43వ సారి మాత్రం..

2 గంటల పాటు నిశ్శబ్దంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?..

Updated Date - Jul 31 , 2025 | 05:12 PM