Share News

Ashwani Kumar: యూకో బ్యాంక్‌లాభం రూ.620 కోట్లు

ABN , Publish Date - Oct 18 , 2025 | 03:52 AM

ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్‌.. సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ.620 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...

Ashwani Kumar: యూకో బ్యాంక్‌లాభం రూ.620 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రభుత్వ రంగంలోని యూకో బ్యాంక్‌.. సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ.620 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 2.82 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్‌ మొత్తం వ్యాపారం 13.23 శాతం వృద్ధితో రూ.4,73,704 కోట్ల నుంచి రూ.5,36,398 కోట్లకు పెరిగిందని యూకో బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అశ్వనీ కుమార్‌ తెలిపారు. మొత్తం డిపాజిట్లు కూడా 10.85 శాతం పెరిగి రూ.2,75,777 కోట్ల నుంచి రూ.3,05,697 కోట్లకు చేరుకున్నాయి. కాగా నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.2,533 కోట్లు, నికర వడ్డీ మార్జిన్‌ 3.08 శాతంగా ఉన్నట్లు బ్యాంక్‌ పేర్కొంది. మరోవైపు స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 3.18 శాతం నుంచి 2.56 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.73 శాతం నుంచి 0.43 శాతానికి తగ్గినట్లు తెలిపింది. ప్రొవిజన్‌ కవరేజీ నిష్పత్తి 96.99 శాతంగా ఉందని పేర్కొంది.

Updated Date - Oct 18 , 2025 | 03:52 AM